Hardik Pandya Wife: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య విడాకులు తీసుకోబోతున్నారట. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త ఎంతగా ప్రచారంలోకి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరిద్దరి విడాకుల గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చినా కనీసం ఈ విడాకుల రూమర్స్ పై వారిద్దరూ నోరు మెదపకపోవడంతో వీరిద్దరి విడాకులు నిజమేనంటూ ఇంటర్నెట్ లో వార్తలు దుమారం లేపుతున్నాయి.
హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు చివర ఉన్న పాండ్యా అనే పేరును తొలగించి, వీరి కొడుకుతో ఉన్న ఫోటోలు ఉంచి మరియు ఈ కపుల్ దిగిన ఫోటోలు తొలిగించింది. ఇవ్వని చూస్తే, ప్రతి ఒక్కటి వారి విడాకుల గురించి ఊహాగానాలు రేపుతున్నాయి. కానీ ఇటీవల మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, నటాషా ఇటీవల ఒక అబ్బాయితో డేటింగ్ ప్రారంభించింది. ఇక అతడు ఎవరని ఆరా తీస్తే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ అని తేలింది.
ఇది తెలుసుకున్న హార్దిక్ పాండ్యా అభిమానులు దీనిపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. అసలు ఈ వ్యక్తితో పాండ్యా భార్యకు సంబంధం ఉందా మరియు ఆమె భర్తకు విడాకులు ఇచ్చిందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎవరైనా సమాధానం చెప్పాలి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో ఎవరికీ తెలీదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే హార్దిక్ పాండ్య అయినా లేదా తన భార్య నటాషా అయినా స్పందించాలిసిందే.