Home Uncategorized Ramoji Rao : రామోజీ రావు అంతక్రియలు ఎప్పుడంటే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

Ramoji Rao : రామోజీ రావు అంతక్రియలు ఎప్పుడంటే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

update-on-ramoji-rao-final-rites-is-here

Ramoji Rao : తెలుగు వారు గర్వించదగ్గ అతికొద్ది మంది ప్రముఖుల్లో ఈనాడు అధినేత మరియు రామోజీ ఫిలిం సిటీ ఓనర్ రామోజీరావు ఒకరు. ఏళ్ల తరబడి అనేక రంగాల్లో సేవలందించిన ఈయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని ప్రముఖుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి పలువురు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు వచ్చి నివలర్పిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఇప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రామోజీ రావు అంతిమయాత్ర బాధ్యతలు తీసుకుందాం అని నిర్ణయించింది. రామోజీరావు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమైన సమావేశం కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సన్నాహాలను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌కు రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

update-on-ramoji-rao-final-rites

రేపు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటె, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈరోజు షూటింగ్లు రద్దు చేసారు. ఇండస్ట్రీ మొత్తం రామోజీరావుకు నివాళ్లు అర్పించడానికి తరలివస్తున్నారు. చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు రామోజీ రావు గొప్పతనం గురించి పోస్ట్ ద్వారా తెలిపారు. ఇపుడు ఈ వార్తా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.