Wednesday, July 3, 2024
HomeCinemaVijay Sethupathi : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్.. అభిమానులు కామెంట్స్..

Vijay Sethupathi : పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్.. అభిమానులు కామెంట్స్..

Vijay Sethupathi : తెలుగు ప్రజలకు విజయ్ సేతుపతి పరిచయం అవసరం లేని పేరు. విజయ్ సేతుపతి పిజ్జా సినిమాతో తెలుగు ప్రజలకు పరిచమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ఈయన ఉప్పెన సినిమాలో విలన్‌గా నటించి రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. విలన్ పాత్రలే కాకుండా హీరో పాత్రల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాల్లో దూసుకుపోతున్నాడు.

అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించింది. పలువురు సినీ తారలు కూడా జనసేన విజయం సాధించాలని ఆకాంక్షించారు. విజయ్ సేతుపతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు.

vijay-sethupathi-comments-on-pawan-kalyan-in-recent-interview

ఆయన పదవి కోసం పోటీ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ పవన్ మాత్రం విజయం దిశగా అడుగులు వేస్తున్నాడని అన్నారు. అంతేకాదు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా పవర్ స్టార్ ఏ అని ఆయన అన్నారు. విజయ్ సేతుపతి పవన్ గురించి వ్యాఖ్యానిస్తూ ఈయన, తన కథకు తానే హీరోనని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ ని ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన వ్యాఖ్యలకు పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts