Mahesh – Namrata : సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇట్టే అందరికి తెలిసిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా ను కొందరు దుర్వినియోగం కూడా చేస్తున్నారు. దేనికైనా రెండు కోణాలు ఉంటాయి. కొంతమంది మంచికి వాడితే మరికొందరు చెడుకు వాడుతుంటారు. ఇపుడు మనం ఇలాంటి ఓ వార్తా గురించి మాట్లాడుకుందాము. కొంత మంది ఆకతాయిలు సూపర్ స్టార్ మహేష్ బాబు పై ట్రోల్ల్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా సమయంలో మహేష్ బాబు ఎలా ట్రోల్ అయ్యాడో మనకు గుర్తుంది.
మరీ ముఖ్యంగా సూపర్‌స్టార్ ఇమేజ్‌ని పక్కనపెట్టి మరీ దారుణమైన మీమ్స్‌తో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేలా మీమ్స్ సోషల్ మీడియాలో రుద్దారు. అయితే ఇప్పుడు ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. మహేష్ బాబు – నమ్రత విషయంలో పెద్ద తప్పు చేశాడంటూ ప్రచారం చేస్తున్నారు. నమ్రత స్టార్ హీరోయిన్. మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లు సినిమాల్లో కనిపిస్తూనే ఉంటారు.
కానీ మహేష్ బాబు పెట్టిన ఒక్క కండిషన్ వల్ల నమ్రత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబు మాత్రం ఆమె ఆశలకు అడ్డుకట్ట వేశారు అంటూ న్యూస్ గుప్పుమంటున్నాయి. అయితే ఈ పోస్ట్లు చూసిన కొందరు మహేష్ బాబు స్వార్థపరుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ మహేష్ బలవంతంగా నన్ను సినిమాలో నటించనివ్వలేదని నమ్రత ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు అంటూ ఆయన అభిమానులు రిప్లై ఇస్తున్నారు. దీనివల్ల ఇంటర్నెట్లో ఆకతాయిలు మరియు మహేష్ అభిమానుల మధ్య టంగ్ వార్ జరుగుతుంది.