Friday, November 22, 2024
HomeCinemaBreaking News : మాజీ మెగా అల్లుడు మృతి.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు..

Breaking News : మాజీ మెగా అల్లుడు మృతి.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు..

Breaking News : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్ అవుతూనే ఉంది. ఇక ముఖ్యంగా శ్రీజ పెళ్లి వ్యవహారాలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిన్న వయసులోనే శిరీష్ భరద్వాజ్ ని ఇంట్లో చెప్పకుండా లేచిపోయి గుడిలో పెళ్లి చేసుకుని నానా రాద్ధాంతం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో చిరంజీవిపై కేసు పెట్టేందుకు శ్రీజ సిద్ధమైంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ వద్ద ఆయుధం ఉందని, ఆ ఆయుధం మా ప్రాణాలకు ముప్పుగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత శ్రీజ అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అని సమాచారం.

chiranjeevi-former-son-in-law-sirish-death

శిరీష్ భరద్వాజ్ 2007లో శ్రీజను వివాహం చేసుకున్నారు మరియు 2014లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్‌ని పెళ్లాడింది, కానీ ఆ తర్వాత శిరీష్, శ్రీజ మళ్లీ ఎప్పుడు ఎక్కడ కలువలెనే లేదు. తన పని తాను చేసుకుపోయిన శిరీష్ భరద్వాజ్ ఆ తర్వాత డాక్టర్ అయిన తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. శిరీష్ భరద్వాజ్ కొంతసేపటి క్రితం మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts