Friday, July 5, 2024
HomeSportSania Mirza : ఇండియన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. తండ్రి క్లారిటీ...

Sania Mirza : ఇండియన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. తండ్రి క్లారిటీ ఇచ్చేసాడు..

Sania Mirza : ఇండియన్ స్పోర్ట్స్ వ్యవస్థలో గొప్ప పేరు సంపాదించుకుంది సానియా మీర్జా. చిన్నతనం నుండే సానియా ఈ క్రీడ మీద మక్కువ చూపించింది మరియు ఇంటర్నేషనల్ ప్లేయర్ గా నిలదొక్కుకోగలిగింది. సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు పాకిస్తానీ ఇంటర్నేషనల్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. వీరి జీవితంలో ఇక్కడి దాకా బానే ఉంది. కానీ ఏమైందో ఏమో వీరు విడాకులు తీసుకుంటున్నారు అని మీడియాలో ఎన్నో వార్తలు గుప్పుమన్నాయి.

ఇవ్వని రూమర్స్ అంటూ కొట్టి పారేసారు సానియా అభిమానులు. కానీ కొన్ని రోజులకు సానియా షోయబ్ కు విడాకులు ఇచ్చేసింది. ఈ ప్రకటన చూసిన ఈమె అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సానియా మీర్జా సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. షోయబ్ మాలిక్ ఈమెకు విడాకులు ఇచ్చేసి వేరే ఓ అమ్మాయిని రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ సానియా ఇప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తనే లేదు. అయితే ఇటీవల సానియా మీర్జా రెండో పెళ్ళికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

sania-mirza-father-responded-on-second-marriage-news-with-indian-cricketer

ఈమె చేసుకోబోయే అబ్బాయి కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఏ అంట. ఇంతకీ సానియా రెండో పెళ్లి చేసుకోబోయే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎవరో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆ క్రికెటర్ మరెవరో కాదు, ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమ్మీ. కొద్దీ రోజులుగా దీనికి సంబందించిన వార్తా ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. అయితే ఈ వార్తలపై స్పందించారు సానియా మీర్జా తండ్రి. ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, సానియా రెండో పెళ్ళికి ఇంకా సిద్ధంగా లేదు. ఇంటర్నెట్లో వచ్చే వార్తలు అవాస్తవం అని ఆయన కొట్టి పారేసారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts