Home Cinema Kalki : కైరా పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా.. చదివి తెలుసుకోండి..

Kalki : కైరా పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా.. చదివి తెలుసుకోండి..

here-are-the-details-about-kaira-character-girl-in-kalki-cinema

Kalki : కల్కి సినిమా విడుదలైంది. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్కి లాంటి సినిమాలను ప్రజలు స్వీకరిస్తారా, లేదా అనే డౌట్ ఉండేది అందరికి. ఈ సందేహం కల్కి సినిమాతో తీరిపోయింది. నాగ్ అశ్విన్ చేసిన పెద్ద రిస్క్ అతని కెరీర్ ను మార్చేసింది. కల్కి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. సినిమా చూసిన ప్రతివారు రెండోసారి చూడాలి అని అంటున్నారు. ఈ సినిమాలో లెజెండరీ నటుడు అమితా బచ్చన్ అశ్వధామ పాత్రలో నటించి అందరిని మెస్మరైజ్ చేసారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒకరు హీరో అమితా బచ్చన్ అంటున్నారు. దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. దీపికా పదుకొణె కూడా తన పాత్రలో చక్కగా నటించింది. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ చాలా మంది నటీనటులను చూస్ చేసుకున్నాడు. వాటిలో అత్యంత ఆకర్షణీయమైన పాత్ర కైరా. సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణెను కాపాడేందుకు కైరా అనే అమ్మాయి కూడా అశ్వద్ధామకు సహాయం చేస్తుంది.

here-are-the-details-about-kyra-character-girl-in-kalki-cinema

ఆమె తన ప్రాణాలతో నిమిత్తం లేకుండా పోరాడుతుంది. ఆమె త్యాగం సినిమాలోని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. అయితే కైరా పాత్రలో నటించిన అమ్మాయి కోసం ఆసక్తికర శోధన మొదలైంది. ఆమె మరెవరో కాదు అన్నా బెన్. ఈమె ప్రముఖ మలయాళ స్క్రిప్ట్ రైటర్ బెన్నీ నయరాంబలం కుమార్తె. ఆమె ఇప్పటివరకు మలయాళ చిత్రాలలో నటించింది మరియు ఈ చిత్రం కల్కి 2898AD ఆమెకు మొదటి తెలుగు చిత్రం. ఆమె 2019లో కుంభ నంగి నైట్స్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.