Sreeleela : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా రవితేజ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన నటనతో, డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో అమ్మడు వరుస అవకాశాలను అందుకోవడంతోపాటు స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది. అప్పట్లో టాలీవుడ్ హీరోలందరూ శ్రీలీలాకు తమ సినిమాలో అవకాశం ఇచ్చేందుకు లైన్ కట్టారు. ఇలా ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన కనిపించింది. శ్రీలీల ఏకంగా 10 సినిమాలు సైన్ చేసిన రోజులున్నాయి.
కానీ శ్రీలిల నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో అమ్మడి జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. దీనితో శ్రీలీలకు అవకాశాలు కూడా తాగాయి. ఈ సమయంలో నటి పలు యాడ్స్ చేస్తుంది మరియు సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఆమె మళ్లీ స్టార్ హీరోయిన్గా మారుతుందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంత హఠాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు షాక్ అవుతున్నారు.