Thursday, September 19, 2024
HomeCinemaNivetha Pethuraj : వైరల్ వీడియో పై స్పందించిన నివేత పేతురేజ్.. చిరంజీవి పెద్ద కూతురికి...

Nivetha Pethuraj : వైరల్ వీడియో పై స్పందించిన నివేత పేతురేజ్.. చిరంజీవి పెద్ద కూతురికి షాక్..

Nivetha Pethuraj : నివేత పేతురాజ్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది కానీ ఈవిడ సెకండ్ హీరోయిన్ గా స్థిరపడిందనే చెప్పాలి. కథానాయిక పాత్రలతో పాటు తనకు వచ్చిన అన్ని పాత్రలను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరి ముఖ్యంగా ఇటీవల నివేత పేతురేజ్ నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ మొత్తం క్రైమ్‌కి సంబంధించినది అని ఈ సిరీస్ చూసిన వారందరికీ తెలుసు.

సిరీస్‌లో నివేత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా నివేదా పేతురాజ్ ఓ వీడియో చేసింది. ఆ మధ్య ఈ వీడియో వైరల్ కూడా అయింది. ఈ వీడియోలో పోలీసులు నివేత కారును ఆపి తనిఖీ చేసి ట్రంక్ తెరవాలని పోలీసులు అంటారు. దీనితో నివేత వారి మాటను తిరస్కరించింది మరియు పొగరుగా మాట్లాడింది. ఈ వీడియో సంచలనం రేపిన విషయం మన అందరికి తెలుసు. అయితే ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా జరిగింది అంట.

nivetha-responded-on-viral-video-at-paruvu-series-launch-bacame-problem-to-sushmitha-konidela

చాలా మంది ఆ వీడియో నిజమని నమ్మి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ప్రమోషనల్ వీడియో నివేత పేతురాజ్‌కి చాలా కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఆమె వీడియోపై స్పందిస్తూ.. పరువు ప్రోమో వీడియో ఇంత ప్రతికూలంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఇకపై అలాంటి ప్రమోషనల్ వీడియో చేయకూడదని నిశ్చయించుకున్నాను అని నివేదా పేతురాజ్ అన్నారు. ఈ వెబ్ సిరీస్‌ని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రొడ్యూస్ చేసింది. అయితే నివేదా పేతురాజ్ ఈ ప్రమోషనల్ ప్లాన్‌పై విమర్శలు గుప్పించింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts