Nivetha Pethuraj : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. ఈ క్యూటీ కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఒరు నాల్ కూతులో ఆమె వెండితెరకు పరిచామయింది. నివేదా తన రెండో సినిమా ఉదయనిధి స్టాలిన్‌తో చేసింది. మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. శ్రీవిష్ణు సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయ్యింది.
ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవవరరా, అలా వైకుంఠపురములో, పాగల్, రెడ్, దాస్ కా ధామ్కీ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ సినిమాల్లోనూ బిజీ బిజీ గా ఉంది నివేత. అయితే నివేదా ఇంతవరకు పెద్ద సక్సెస్‌ను అందుకోకపోవడంతో స్టార్ స్టేటస్ పొందలేకపోయింది. కానీ హీరోయిన్ గా బిజీ షెడ్యూల్ తో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పరువు అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది మరియు
అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్ తన బ్రేకప్ స్టోరీని పంచుకుంది. చాలా మంది జీవితాల మాదిరిగానే, నివేదా పేతురాజ్ జీవితం కూడా ఒక విషాద ప్రేమకథను కలిగి ఉంది. నివేదా ప్రేమికుడిని ఆమె స్నేహితురాలు వలలో వేసుకుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నివేదా పేతురాజ్ మాట్లాడుతూ నేను ఓ వ్యక్తిని గాడంగా ప్రేమించాను. కానీ చివరికి నేను మోసపోయాను. నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను, త్వరగా ప్రేమలో పడకండి. చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.