Friday, November 22, 2024
HomeCinemaఈ ఏడాది చేసింది ఒక్కే సినిమా కానీ కట్టిన టాక్స్ 20 కోట్లు.. అత్యధిక పన్ను...

ఈ ఏడాది చేసింది ఒక్కే సినిమా కానీ కట్టిన టాక్స్ 20 కోట్లు.. అత్యధిక పన్ను కట్టిన హీరోయిన్ తినే . .

ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ గా పిలవబడే సూపర్ స్టార్స్ లో ఒకరు కరీనా కపూర్. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ(Highest Tax Paying Actress) నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనేక మంది ఆర్టిస్టులలో ఈమె ఒకరు. ‘ఎనిమల్’ హీరో రణబీర్ కపూర్ కి ఈమె కజిన్ అవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కరీనా కపూర్, ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని పెళ్ళాడి సినిమాలకు విరామం ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగి, ప్రస్తుతం విలన్ గా రాణిస్తున్నాడు.

త్వరలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ దేవర చిత్రంలో ఈయన విలన్ గా కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇతన్ని పెళ్లి చేసుకొని కొంత కాలం ఇండస్ట్రీ కి విరామం ప్రకటించిన కరీనా కపూర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది. రీ ఎంట్రీ లో కూడా ఈమె క్యారక్టర్ రోల్స్ కాకుండా మెయిన్ లీడింగ్ రోల్స్ లోనే నటిస్తుండడం విశేషం. అయితే ఈ ఏడాది ఆమె కేవలం ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. కానీ 20 కోట్ల రూపాయిల టాక్స్ ని కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది(Highest Tax Paying Actress).

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్స్ సూపర్ స్టార్స్ గా ఎదిగారు, కానీ ఒక్కరికి కూడా కరీనా కపూర్ రేంజ్ రాకపోవడం గమనార్హం. కేవలం ఒకే ఒక్క సినిమా చేసి ఆమె 20 కోట్ల రూపాయిల పన్ను కట్టే స్థాయిలో ఉంటే, 12 కోట్ల రూపాయిల పన్ను కట్టి యంగ్ బ్యూటీ కియారా అద్వానీ రెండవ స్థానంలో కొనసాగుతుంది. కియారా అద్వానీ చేతిలో ప్రస్తుతం బోలెడన్ని సినిమాలు ఉన్నాయి, రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈమె తర్వాతి స్థానం లో కత్రినా కైఫ్ 11 కోట్ల రూపాయిల టాక్స్ తో మూడవ స్థానం లో కొనసాగుతుంది. కరీనాకపూర్ లాగానే వీళ్ళు కూడా యాడ్స్ చేస్తున్నారు, వీళ్లకు కూడా ఇతర వ్యాపారాలు ఉన్నాయి . అయినా కూడా ఆమెని బీట్ చేయలేకపోతున్నారు అంటే ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనే కదా అర్థం, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె కుర్ర హీరోయిన్స్ కి ఇంకా ఎంత పోటీ ఇవ్వబోతుంది అనేది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts