Friday, September 20, 2024
HomeCinemaHoney Rose: అలాంటి పనులు చేసి తన కోరికను తీర్చుకున్న హీరోయిన్ హనీ రోజ్..

Honey Rose: అలాంటి పనులు చేసి తన కోరికను తీర్చుకున్న హీరోయిన్ హనీ రోజ్..

ఈమధ్య హీరోయిన్స్ కి హీరోలకు రెమ్యూనరేషన్స్ అసలు ఏ మాత్రం సరిపోవడం లేదేమో, అందుకే ఇతర వ్యాపారాలను కూడా సమాంతరంగా మ్యానేజ్ చేస్తూ తమ పాకెట్స్ ని నింపుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఏకంగా ప్రొడక్షన్ హౌస్లను ప్రారంభించి సినిమాలను నిర్మించేస్తున్నారు(Honey Rose Production House). అందుకు ఉదాహరణ నాగబాబు తనయురాలు నిహారిక కొణిదెలనే. నిర్మాతగా మారిన ఈమె పలు వెబ్ సిరీస్ తీసి చేతులు కాల్చుకుంది. కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈమె ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది.

మొత్తం కొత్తవాళ్లతో తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి కాసుల కనకవర్షం కురిపించింది. నిర్మాతగా నిహారిక స్థానాన్ని పదిలం చేసింది. ఈమె లాగానే సమంత కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది, ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హనీ రోజ్ కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీ ని మొదలు పెట్టింది(Honey Rose Production House). ‘హానీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్’ పేరుతో ప్రారంభించిన తన ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సినిమా అనేది ఒక అందమైన కల. ఒక అద్భుతమైన విజన్ మరియు వెంచర్.

దాదాపుగా నేను ఈ ఇండస్ట్రీ లో 20 ఏళ్ళ నుండి పని చేస్తున్నాను. కోట్లలో ఒకరిద్దరికి దక్కే ఈ అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఒక వరం లాగా భావిస్తున్నాను. నాకు ఇంత మేలు చేసిన ఇండస్ట్రీ ఋణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించాను. నటిగా నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన మీ ప్రేమాభిమానాలు, నిర్మాతగా కూడా నాకు దక్కుతాయని ఆశిస్తున్నాను. కావాల్సినంత టాలెంట్ పెట్టుకొని ఒక్క అవకాశం కోసం ఎదురు చూసే ఔత్సాహికులకు మా సంస్థ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ ప్రయాణం లో నాకు అండగా నిలబడిన అభిమానులకు కృతఙ్ఞతలు’ అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. మలయాళం లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హానీ రోజ్, తెలుగు లో బాలయ్య బాబు నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఈ ఒక్క సినిమాతోనే హానీ రోజ్ టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ అనుకున్న అవకాశాలు మాత్రం మన టాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో రాలేదు, కేవలం షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితమైంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts