Vadde Naveen : ఒకప్పుడు స్టార్ హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వడ్డే నవీన్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. తెలుగు సినీ పరిశ్రమ చిరకాలం గుర్తించుకోదగ్గ అద్భుతమైన సినిమాలను ఈయన అందించాడు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకుగా ఈయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. వడ్డే రమేష్ తెలుగు మరియు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. సూపర్ స్టార్ కృష్ణ మరియు నందమూరి కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు.
అలా సినీ బ్యాక్ గ్రౌండ్ నుండే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు నవీన్. 1997 వ సంవత్సరం లో ఈయన ‘కోరుకున్న ప్రియుడు’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్లోకి హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక అదే ఏడాది లో విడుదలైన ‘పెళ్లి’ చిత్రం మాత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలు కూడా అప్పట్లో ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత అదే ఏడాది మరో మూడు సినిమాల్లో హీరోగా నటించాడు, అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇక ఆ తర్వాత 1998 వ సంవత్సరం లో ఆయన చేసిన ‘స్నేహితులు’, ‘మనసిచ్చి చూడు’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రాలతో నవీన్(Vadde Naveen) ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో గా మారిపోయాడు. అలా కెరీర్ లో దూసుకొచ్చిన ఆయనకీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఆ ఫ్లాప్స్ నుండి మళ్ళీ తేరుకోవడానికి చాలా కష్టమైంది. 2003 వ సంవత్సరంలోనే వడ్డే నవీన్ మార్కెట్ మొత్తం పోగొట్టుకునే స్థితికి వచ్చేసాడు. అయినప్పటికీ కూడా ఆయనకీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2010 వ సంవత్సరం వరకు నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు.
కానీ ఆ తర్వాత అతనికి లాంగ్ గ్యాప్ వచ్చింది. 2016 వ సంవత్సరం లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఎటాక్’ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడం తో ఇక సినిమాలకు దూరం అయ్యాడు. వ్యాపారాలు చూసుకుంటూ బిజీ గా ఉన్నాడు. బిగ్ బాస్ గత సీజన్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది కానీ, వడ్డే నవీన్ సున్నితంగా రిజెక్ట్ చేసాడు.