Friday, September 20, 2024
HomeCinemaTwinkle Sharma: RRR చిత్రంలో మల్లి గుర్తుందా..? ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి..

Twinkle Sharma: RRR చిత్రంలో మల్లి గుర్తుందా..? ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి..

Twinkle Sharma RRR : దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ప్రస్తుతం స్టార్ హీరోలకు అవకాశం దొరికినా ఒక అదృష్టం గా భావిస్తారు. అలాంటి డైరెక్టర్ సినిమాలో కథకి అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం సంపాదించిన ఆర్టిస్టులు ఇంకెంత అదృష్టవంతులో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు RRR చిత్రం లో మల్లీ పాత్ర పోషించిన అమ్మాయి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సినిమా ప్రారంభం అయ్యేది ఈ పాత్రతోనే, పాపం జూనియర్ ఎన్టీఆర్ ఈమెని బ్రిటీష్ సర్కార్ నుండి విడిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడుతాడో మన అందరికీ తెలిసిందే.

చావు దెబ్బలు కూడా తింటాడు. రామ్ చరణ్ తో కూడా కేవలం ఈమె కోసమే పోరాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలా ఈ చిత్రం లో గోండు జాతి పిల్లగా నటించిన ట్విన్కల్ శర్మ(Twinkle Sharma RRR) గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అమ్మాయి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందినది. అక్కడే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుండి ఈమెకి(Twinkle Sharma RRR) డ్యాన్స్ లో గొప్ప ప్రతిభ ఉంది. డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం కూడా. ఆ మక్కువ తోనే ఈమె పలు డ్యాన్స్ షోస్ లో కూడా పాల్గొన్నది. పలు టీవీ యాడ్స్ లో కూడా నటించింది. ముఖ్యంగా అత్యధిక వినియోగదారులు ఉపయోగించే ఈ కామర్స్ యాప్ ఫ్లిప్ కార్ట్ యాప్ లో ఈమె నటన చూసి అత్యంత ఆకర్షిస్తుడైన రాజమౌళి RRR చిత్రంలోకి తీసుకున్నాడు.

అలా మన టాలీవుడ్ కి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చిన ఒక చిత్రంలో ఈమె భాగం అయ్యింది. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. RRR చిత్రం వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఈ రెండేళ్లలో ఈమెలో ఇంత మార్పు వచ్చిందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోక తప్పదు. సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండేందుకు ఈమె తెగ ప్రయత్నం చేస్తుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ట్విన్కుల్ శర్మ.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ప్రముఖ యంగ్ హీరో ఈమెని తన సినిమాలోకి రీసెంట్ గానే తీసుకున్నాడట. రెమ్యూనరేషన్ కూడా భారీ గానే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. RRR చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించిన ఈ చిన్నది, భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంత మేరకు సక్సెస్ అవ్వబోతుందో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts