Sridevi : సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నటి శ్రీదేవి అనే చెప్పాలి. ఈ అందాలతార అప్పట్లో ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవం మరియు ఎందరో మంది కళల రాకుమారి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో శ్రీదేవి వెండితెరపై కనిపిస్తే చాలు అని వెర్రెక్కిపోయి చూసేవారు ఉన్నారు. అప్పట్లో ఈమె స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ సంపాదించుకుంది.
ఇది హీరోయిన్లకు అసాధ్యం అనుకునే వారికీ శ్రీదేవి అది తప్పు అని నిరూపించి చూపించింది. ఈమె అభిమానులు వెండితెరపై అందాలతారను చూసేందుకు వెళ్లేవారు కోట్లలో ఉంటారు. హీరోగా ఎంత పెద్ద స్టార్ ఉన్న కూడా శ్రీదేవి ఆ సినిమాలో నటిస్తుంది అంటే ఆ సినిమాకు వేరే లెవెల్ హైప్ వచ్చేది. ఇలా ఆమె సౌత్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకొని హిందీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస సినిమాలతో దూసుకుపోయి అద్భుతమైన సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు మామూలు క్రేజ్ లేదు.
ఈ నటి ఏ ఇండస్ట్రీలో చేసిన కూడా తన నటన మరియు అందంతో అక్కడ ఉన్న వారి మనసులు దోచేసింది. ఈమె నటించి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూలు సంపాదించుకునేది. అయితే శ్రీదేవి ను చూడడానికి తెలుగు మరియు కనడ ప్రజలు ఏకంగా చెన్నై లోని తన నివాసం వద్ద నిద్రాహారాలు మానుకొని నిలబడేవారు. ఆమె బయటికి వచ్చినపుడు అక్కడ ఉన్న తాన్ అభిమానులకు చేయి ఊపుతూ హాయ్ చెపితే అదే చాలు అనుకునే వారు అభిమానులు. అప్పట్లో సినీ అభిమానులు అలా ఉండేవారు.
ఇలా శ్రీదేవికి ఉన్న ఫాన్స్ తనను ఒక్కసారైనా ఆమెను నిజజీవితంలో చూడాలని కోరుకునేవారు. ఇలానే ఓ దుబాయ్ కు సంబందించిన షేక్ శ్రీదేవి చూడాలి అనుకున్నారట. ఆయన శ్రీదేవి తల్లిని కలిసి ఆమెను ఓసారి కాళీయమని కొర్రారట. దానికి శ్రీదేవి తల్లి దుబాయ్ షేక్ ను 4000 గజాలు ఉన్న ఓ ప్లాట్ మరియు ఎంతో ఖరీదు చేసే బంగ్లా కొనిస్తే ఆమెను కలిపిస్తా అని డిమాండ్ చేసిందట.
ఆ దుబాయ్ కు సంబందించిన షేక్ వెంటనే ఏమి ఆలోచించకుండా ఆమె అడిగినవి అన్ని కొన్ని శ్రీదేవి పేరుపై రిజిస్టర్ చేసి ఆమె అమ్మగారిని కలిసి పట్టాలు ఇచ్చి శ్రీదేవి ని ఓసారి కలిశాడట. ఇలా శ్రీదేవి(Sridevi) ని చూడటానికి అభిమానులు ఇంత వెర్రిగా ఉండేవారట.