Aamani : తెలుగు సినిమాల్లో కొంతమంది నటీమణులు తమదైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో సీనియర్ నటి ఆమని ఒకరు. టాలీవుడ్‌లో చాలా కాలంగా నటిస్తూనే ఉంది. తాజాగా ఓ సినిమాలో లిప్ కిస్ సీన్ గురించి మాట్లాడింది. ఆ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపై తొలిసారి కెమెరా ముందు నోరు విప్పింది. ఆమని ఆడది సినిమాతో నటిగా తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఆ తరువాత జంబ లకిడి పంబ సినిమాలో నటించి బాగా పాపులర్ అయ్యింది.
అప్పటి నుంచి ఈ నాటికీ వరుసగా నటించే అవకాశాలు వచ్చిపడాయి. తన కెరీర్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, నరేష్ వంటి నటులతో చాలా సినిమాల్లో నటించింది. ఆమె కెరీర్ మొత్తంలో, ఆమె ఎన్నో గొప్ప పాత్రలు పోషించింది మరియు ‘శుభలగ్నం’, ‘మిస్టర్’ వంటి చిత్రాలలో తన నటనకు అవార్డులను గెలుచుకుంది. ఆమె మంచి నటనతో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఆమని 2014లో ‘చందమామ కథలు’ అనే సినిమాలో నటించింది, అక్కడ ఆమె తన సహనటుడు నరేష్ తో లిప్ లాక్ సీన్లు చేసింది.
అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆమని చాలా కాలం తరువాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది. నటిగా సక్సెస్ కావాలంటే కొన్నిసార్లు బోల్డ్ పనులు చేయాల్సి ఉంటుందని చెప్పింది. నా హీరోయిన్ కెరీర్ లో బోల్డ్ పాత్రలలో నటించాను. ఇపుడు కూడా నటిలాగే ఆ స్క్రిప్ట్ కు అవసరం కాబట్టి లిప్ లాక్ కు ఓకే చెప్పను దానిలో ఎం ఉంది అంటూ అందరిని ఆశ్చర్యపరిచింది ఆమని. ఇపుడు ఈ వీడియో నేటిన్ట్లో వైరల్ అవుతుంది.