Home Cinema ప్రముఖ విలన్ మురళీ శర్మ భార్య కూడా నటి అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?

ప్రముఖ విలన్ మురళీ శర్మ భార్య కూడా నటి అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?

actor-murali-sharma-wife-is-also-an-actor-do-you-know-who-is-she

టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని దక్కించుకున్న నటులలో ఒకరు మురళి శర్మ(Murali Sharma Wife). ఈయన మన టాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘అతిథి’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ‘అతనొక్కడే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సినిమా కావడంతో ఆరోజుల్లో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది.

ఓపెనింగ్స్ దంచి కొట్టింది. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇందులో విలన్ గా నటించిన మురళి శర్మ(Murali Sharma Wife) పెర్ఫార్మన్స్ ని మాత్రం ఆడియన్స్ మర్చిపోలేకపోయారు. అంత అద్భుతంగా నటించాడు ఆయన. ఈ చిత్రం తర్వాత తెలుగు లో ఆయనకీ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. ఇప్పుడు మన టాలీవుడ్ లో మురళీ శర్మ లేని సినిమా అంటూ ఉండదేమో అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ప్రతీ ఒక్కరి సినిమాలో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసాడు.

ముఖ్యంగా ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా ఆయన చేసిన క్యారక్టర్ ఎంతలా పేలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంతమంచి పేరు వచ్చిందో, మురళీ శర్మ కి కూడా అంతే మంచి పేరొచ్చింది. ఇది ఇలా ఉండగా, మురళీ శర్మ సతీమణి అశ్వినీ కుల శేఖర్ కూడా ఒక నటి అనే విషయం చాలా మందికి తెలియదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘బద్రీనాధ్’ చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె విలన్ గా నటించింది.

ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ, ఎవరీమె అనే చర్చ మాత్రం జనాల్లో నడించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు కానీ, హిందీ, మరాఠి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈమె టెలివిజన్ లో బాగా పాపులర్ నటి అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఈమె పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరో గా నటించిన మెహబూబా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తులో కూడా మంచి పాత్రలు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది అశ్వినీ.