Friday, November 22, 2024
HomeCinemaSarathkumar : నటి వరలక్ష్మి పెళ్లి ఖర్చు అన్ని కోట్లా.. తండ్రి శరత్ కుమార్ బయటపెట్టేసాడు..

Sarathkumar : నటి వరలక్ష్మి పెళ్లి ఖర్చు అన్ని కోట్లా.. తండ్రి శరత్ కుమార్ బయటపెట్టేసాడు..

Sarathkumar : సెలబ్రిటీల గ్రాండ్ వివాహాలకు వేలకోట్లు ఖర్చు పెడతారన్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా, ఈ రోజుల్లో సినీ తారలు తమ వివాహాలను విదేశాలలో జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా చాలా మంది సెలెబ్రిటీలు ఇలా పక్క దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ముంబైకి చెందిన గ్యాలరీ యజమాని నికోలాయ్ సచ్‌ దేవ్‌ ను థాయ్‌లాండ్‌లో వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం జూలై 2న అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం చెన్నైలోని తాజ్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలు కూడా హాజరై వరలక్ష్మి, నికోలాయ్ పెళ్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే, గత రెండు రోజులుగా వారి పెళ్లి బడ్జెట్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Varalakshmi-Sarathkumar-Marriage-Budget

శరత్ కుమార్ తన గారాల పట్టి వరలక్ష్మి పెళ్ళికి సుమారు 200 కోట్లు పైగా ఖర్చు చేసారు అంటూ ఎన్నో కథనాలు వస్తున్నాయి ఇంటర్నెట్లో. అయితే తాజాగా ఈ వార్తలపై శరత్ కుమార్ ఖండించారు. సమాచారం లేకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. 200 కోట్లు వరలక్ష్మి పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని శరత్ కుమార్ వెల్లడించాడు. వరలక్ష్మి వివాహ వేడుకను ఇతరుల మాదిరిగానే నిర్వహించారని, ఖర్చుపై మీడియాలో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts