Home Cinema Balakrishna : బాలకృష్ణ – అంజలి వివాదంపై ఘాటుగా స్పందించిన స్టార్ డైరెక్టర్.. చెత్తనా కొడుకు...

Balakrishna : బాలకృష్ణ – అంజలి వివాదంపై ఘాటుగా స్పందించిన స్టార్ డైరెక్టర్.. చెత్తనా కొడుకు అంటూ కామెంట్స్..

Balakrishna : స్టార్ హీరో బాలకృష్ణ మళ్ళి వివాదంలో ఇరుక్కున్నాడు. రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో కలకలం రేపుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన పనే. అయితే, విశ్వక్సేన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాడు మరియు అందరూ చూస్తుండగా హీరోయిన్ అంజలిని అకస్మాత్తుగా వేదికపైన నెట్టడంతో వివాదం తలెత్తింది. అయితే ఆడవారి పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తారా, బాలకృష్ణ ఇలా ఎందుకు ప్రవర్తించాడు అంటూ అందరు ఘాటు గా స్పందిస్తున్నారు.

అంజలి బాలకృష్ణకు సంబంధించిన ఈ వీడియోను స్టార్ సింగర్ చిన్మయ్ కూడా ట్వీట్ చేశారు. విశ్వక్సేన్ మరియు నాగ వంశీ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ ఇది బాలకృష్ణ సరదాగా చేసారు అని క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం పై అందరితో పాటు అంజలి కూడా స్పందిస్తూ మా మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ గారు అంటే నాకు చాలా గౌరవం అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇటీవల బాలీవుడ్ కి చెందిన ఓ దర్శకుడు ఈ వీడియోను రేపోస్ట్ చేసి బాలకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

star-director-responeded-on-balakrishna-anjali-issue

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు హన్సల్ మెహతా. ఆ వీడియోను షేర్ చేస్తూ ఎవరు ఈ చెత్త నా కొడుకు అని రాశారు. తదనంతరం, ఒక నెటిజన్ ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, అతను నందమూరి రామారావు కుమారుడని చెప్పాడు. ఇలా అసలు ఎవరైనా ప్రవర్తిస్తాడా. ఓ స్టార్ హీరో అయుండి ఇలా హీరోయిన్ లతో బెహేవ్ చేయడం సిగ్గుచేటు అంటూ తెలిపారు. మీలాంటి వారే ఇలా చేస్తే యంగ్ హీరోలు కూడా ఇలానే చేస్తారు. ఇపుడు అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version