Hansika : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు హన్సిక. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేశముదురు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హన్సిక తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. అంతకు ముందు ఆమె బాలనటిగా కూడా గొప్పగా రాణించింది. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘కోయి మిల్గయా’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి క్రేజ్ ని సంపాదించింది.
ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో నటించి మంచి పాపులర్ అయినా హన్సిక, దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె(Hansika) వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. ఈమెకి తెలుగులో కంటే కూడా తమిళం లో ఎక్కువ క్రేజ్, అక్కడ ఈమెకి అభిమానులు గుడి కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయట. దాదాపుగా అక్కడి స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన హన్సిక, టాలీవుడ్ లో మాత్రం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె సోహైల్ కటోరియా అనే అతనిని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు బాగా తగ్గిపోతాయి అని అంటుంటారు. కానీ హన్సిక(Hansika) కి మాత్రం అవకాశాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా మన స్టార్ హీరోయిన్లు మారుతున్న ఆడియన్స్ కి తగ్గట్టుగా అడల్ట్ కంటెంట్ చెయ్యడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు , కానీ హన్సిక మాత్రం తన భర్త ముందు అడల్ట్ సన్నివేశాలకు నో చెప్పినట్టుగా నటించి,
ఆ తర్వాత సదరు నిర్మాతలకు ఫోన్ చేసి అడల్ట్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ, కానీ రెమ్యూనరేషన్ ఇంత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుందట. సినిమా విడుదలైన తర్వాత ఒకవేళ భర్త ఆ సన్నివేశాలు చూస్తే, అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేయించింది అని కవర్ చేస్తాదట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో ఆమె రాబొయ్యే సినిమాల ద్వారా తెలుస్తుంది. హన్సిక ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరు తమిళ్ గార్డియన్, ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కు రెడీగా ఉంది.