Saturday, November 23, 2024
HomeCinemaTabu Affairs: నటి టబు ని ఇంత మంది హీరోలు ప్రేమించి మోసం చేశారా.. పాపం..

Tabu Affairs: నటి టబు ని ఇంత మంది హీరోలు ప్రేమించి మోసం చేశారా.. పాపం..

Tabu Affairs: టాలీవుడ్ లో ఇప్పటికీ కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే రేంజ్ అందం ఉన్న సీనియర్ హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఈ వయస్సులోనే ఇలా ఉంటే, అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేవారో అని అనుకుంటూ ఉంటాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు టబు. ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన కూలి నెంబర్ 1 చిత్రం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ కి మొట్టమొదటిసారి పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఈమెకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అక్కినేని నాగార్జున తో ఈమె చేసిన ‘నిన్నే పెళ్లాడట’ చిత్రం ఇండస్ట్రీ ని షేక్ చేసింది.

tabu-affairs-list

ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈమె జీవితం లో ఎన్నో రూమర్స్, ఎన్నో అఫైర్స్ ఉన్నాయి. స్టార్ హీరోలు ఈమె ని నమ్మించి మోసం చేసి పెళ్లి కూడా చేసుకొని విధంగా చేసేసారు అని అందరూ అంటూ ఉంటారు(Tabu Affairs). సినిమాల్లోకి రాకముందే ఆమె ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో ప్రేమాయణం నడిపింది అట. కానీ అతను కాజోల్ తో కూడా ప్రేమాయణం నడిపి, చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన నుండి కోలుకోవడానికి టబు కి చాలా సమయం పట్టింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె అక్కినేని నాగార్జున తో కూడా ప్రేమాయణం నడిపింది.

actress-tabu

వీళ్లిద్దరి రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి టాలీవుడ్ లో కథలు కథలు గా చెప్తారు. కానీ నాగార్జున తో బెడ్ వరకు వెళ్ళింది కానీ, ఆయన మనసులో మాత్రం చోటు సంపాదించుకోలేక పోయిందని అందరూ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు సంజయ్ కపూర్ అనే బాలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడిపింది. కానీ ఆయన చివరికి సుస్మిత సేన్ ని పెళ్ళాడి టబు ని మోసం చేసాడు. ఇలా ఇంతమంది ఆమెని మోసం చెయ్యబట్టే, ప్రేమ , పెళ్లి మీద విరక్తి కలిగి సింగల్ గా మిగిలిపోయిందని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. ప్రస్తుతం ఆమె అన్ని రిలేషన్స్ కి దూరంగా ఉంటూ కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు దూసుకుపోతుంది.

nagarjuna-tabu

ప్రస్తుతం ఈమె ఇప్పటికీ కూడా ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది, ఒక్కో సినిమాకి ఈమె రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఒకానొక సమయంలో నాగార్జున టబు గాఢమైన ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ టబూ కి అప్పటికే చాల మందితో ఎఫైర్ ఉందని తెలిసి అక్కినేని నాగేశ్వర్ రావు గారు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు అంట.

ఈ వార్త ఎంత నిజమో తెలీదు కానీ, అప్పట్లో ఈ వార్త సినీ వర్గాల్లో తేజ్ చెక్కర్లు కొట్టింది. నాగార్జున చివరికి దగ్గుబాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నాగ చైతన్య వీరిద్దరి సంతానమే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts