Home Cinema పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. వైరల్ గా మారిన ఫోటోలు..

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. వైరల్ గా మారిన ఫోటోలు..

deepika-padukone-gave-birth-to-her-first-child

Deepika Padukone Child ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే. 2018 వ సంవత్సరం నవంబర్ నెలలో వీళ్లిద్దరు అతిరథ మహారథుల సమక్ష్యం పెళ్లి చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి వీళ్ళిద్దరిని ఆశీర్వదించారు.

అయితే ఈ ఇద్దరు ఎట్టకేలకు నిన్న పండింటి ఆడ బిడ్డకు జన్మని ఇచ్చారు(Deepika Padukone Child). గత కొంతకాలం నుండి దీపికా పదుకొనే బేబీ బంప్ తోనే కనిపిస్తూ ఉండేది. కల్కి మూవీ ప్రొమోషన్స్ సమయంలో ఆమె ఇలాగే వచ్చింది. అయితే కల్కి చిత్రం మొత్తం ఆమె అలాగే కనిపించింది కదా, ఇది కేవలం సినిమా ప్రొమోషన్స్ కోసం ఆమె అలా సిద్దమై వచ్చింది అంటూ మీడియా లో ప్రచారం సాగింది. అయితే అది నిజమైన బేబీ బంప్ అని తర్వాత తెలిసింది. సినిమాలో కూడా ఆమె అనేక సన్నివేశాలు బేబీ బంప్ తోనే చేసింది. పోరాట సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం డూప్ ని వాడారట.

ఇకపోతే రణవీర్ సింగ్ మరియు దీపికా పై ఆమధ్య మీడియా లో అనేక రూమర్స్ వచ్చాయి. ఎందుకంటే వీళ్లిద్దరు బాలీవుడ్ లో పాపులర్ షో గా పిలవబడే కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో పాల్గొంటారు. ఈ ప్రోగ్రాం లో దీపికా పదుకొనే తన క్రష్ లిస్ట్ తో పాటుగా, గతంలో ఆమె డేటింగ్ చేసిన హీరోల గురించి కూడా చెప్పుకుంది. దీనికి రణవీర్ సింగ్ కి లైవ్ లోనే కోపం వచ్చింది, దీపికా పై చిరాకు పడ్డాడు. ఇంటికి వెళ్లిన తర్వాత వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయని. ఆ గొడవలు విడాకుల వరకు దారి తీసే ప్రమాదం ఉంది అంటూ అనేక కథనాలు వినిపించాయి. అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పారు ఈ జంట.

ఇది ఇలా ఉండగా మూడు రోజుల క్రితమే దీపికా పదుకొనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బేబీ బంప్ తో దిగిన ఫోటో షూట్ ని అప్లోడ్ చేసింది. ఇవి తెగ వైరల్ గా మారింది. అలా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మూడు రోజులకే ఆమె ఒడిలో పండంటి ఆడబిడ్డ వచ్చి చేరింది. వాస్తవానికి ఈ నెలాఖరున ఆమెకి డెలివరీ అవ్వాలి, కానీ ముందుగానే అయిపోయింది.

Exit mobile version