Home Cinema Trisha : ఆ స్టార్ డైరెక్టర్ తో హీరోయిన్ త్రిష పెళ్లి ఫిక్స్.. ఫ్యాన్స్ కి...

Trisha : ఆ స్టార్ డైరెక్టర్ తో హీరోయిన్ త్రిష పెళ్లి ఫిక్స్.. ఫ్యాన్స్ కి ఇక పండగే..

Trisha : తెలుగు మరియు తమిళ భాషల్లో దాదాపుగా అందరి టాప్ స్టార్స్ పక్కన నటించి, అనతి కాలం లో సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ని దక్కించుకొని నెంబర్ 1 హీరోయిన్ గా కొన్నాళ్ళు సాగిన నటి త్రిష. నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ కూడా ఈమె క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈమె కెరీర్ లో హిట్స్, సూపర్ హిట్స్ తో పాటుగా ఇండస్ట్రీ హిట్స్ కూడా చాలానే ఉన్నాయి(Trisha Marriage With Hero). రెండు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న త్రిష కెరీర్ ఒక్కసారి కూడా స్లంప్ లో పడినట్టు అనిపించలేదు. తెలుగు లో ఆమె సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసింది కానీ, తమిళం లో మాత్రం యాక్టీవ్ గా సినిమాలు చేస్తూనే ఉంది.

actress-trisha-marriage

ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్లు ఎంతమంది ఇండస్ట్రీ కి వచ్చినా త్రిష కి ఉన్న డిమాండ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. అయితే హీరోయిన్ గా ఎంతటి స్థాయిలో ఉందో, ఆమె అఫైర్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అని కోలీవుడ్ లో ఒక ప్రచారం ఎప్పటి నుండో సాగుతుంది. అలా ఆమె అఫైర్స్ నడిపిన వాళ్ళతో త్రిష కి పెళ్లి కి సెట్ అవ్వలేదు కానీ, ప్రముఖ బిజినెస్ మెన్ వరుణ్ మాణియన్ తో మాత్రం ఆమెకి పెళ్లి సెట్ అయ్యింది(Trisha Marriage With Hero). వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది, కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, పెళ్లి పీటల వరకు వీళ్ళ బంధం కొనసాగలేదు.

మధ్యలోనే ఆగిపోయింది, ఆ తర్వాత పెళ్లి ఊసు ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చిన త్రిష, ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తుంది. ఒక మలయాళీ డైరెక్టర్ తో త్రిష చాలా కాలం నుండి ప్రేమాయణం నడిపిస్తుందని. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే వీళ్ళ పెళ్ళికి సంబంధించిన వార్తని వినబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన త్రిష, ఇప్పుడు విజయ్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ తెరకెక్కిన ‘లియో’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా వచ్చే నెల విజయదశమి కానుకగా విడుదల కాబోతుంది. ఒక నెల క్రితం కూడా త్రిష సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది అని కొన్ని వార్తలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఫొటోస్ వీడియోస్ కూడా బయటికి వచ్చే సరికి నిజం అని అనుకున్నారు ఫాన్స్ సినీ వర్గం వాలు. కానీ అందరూ అనుకున్నట్టు అది పెళ్లి కాదు ఒక జ్యువలరీ బ్రాండ్ కి తాను చేసిన యాడ్.

త్రిష మధ్య కాలంలో సినిమాల నుండి మాయం ఐపోయింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ పొన్నియన్ సెల్వం సినిమా తో కంబ్యాక్ ఇచ్చి ఇపుడు సినిమాల మీద సినిమాలు చేస్తుంది.

Exit mobile version