Home Cinema Samantha : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ సమంత.. షాక్ లో ఫ్యాన్స్..

Samantha : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ సమంత.. షాక్ లో ఫ్యాన్స్..

Samantha : ఇండియా లోనే మోస్ట్ క్యూట్ హీరోయిన్ ఎవరు అంటే టక్కుమని మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సమంత. ప్రతీ ఏటా ఎంత మంది కుర్ర హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వస్తున్నా ఈమె రేంజ్ కి మాత్రం ఎవ్వరూ చేరుకోలేకపోతున్నారు. ఆమె సినిమాలు చేసినా, చెయ్యకపోయినా ఆమె వెంటే ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హీరోలలో పవన్ కళ్యాణ్ (Samantha Gym Look)కి ఎలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారో, హీరోయిన్స్ లో సమంత కి అలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

samantha-looking-more-beautiful-and-hot-in-her-new-gym-look-which-satisfies-her-fans

ఆమెకి ఒక మీడియం రేంజ్ హీరోకి ఉన్నంత మార్కెట్ ఉంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత నిత్యం వార్తల్లో ఉంటున్న సమంత కి మయోసిటిస్ అనే వ్యాధి సోకింది అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రాణహాని చేసే ఈ వ్యాధితో పోరాడి సమంత జయించింది. ఇప్పుడు చివరి చికిత్స కోసం ఆమె న్యూ యార్క్ కి వెళ్ళింది. ఈ ట్రీట్మెంట్ కోసం ఆమె పాతిక కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

జిమ్ లో హీరోలతో సమానంగా ఈమె వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఆ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. రీసెంట్ గా ఈమె జిమ్ వర్కౌట్స్ లో దిగిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది. ఎవరికైనా వయస్సు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ ఇక్కడ సమంతా కి అందం పెరిగిపోతుంది. ఇంతకు ముందుకంటే కూడా ఇప్పుడు ఉన్న లుక్స్ అదిరిపోయాయి.

ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే రేంజ్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తే ఆమె కుర్ర హీరోల సరసన కూడా నటించగలదు ఇప్పటికీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన రొమాన్స్ సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. సమంత(Samantha Gym Look) ఈమధ్య కాలం లో ఇంత రొమాంటిక్ గా ఏ చిత్రం లో కూడా నటించలేదు.

Exit mobile version