Home Cinema హీరోలను అతి దారుణంగా మోసం చేసిన హీరోయిన్లు వీళ్ళే.. మామూలు కంచులు కాదండోయ్..

హీరోలను అతి దారుణంగా మోసం చేసిన హీరోయిన్లు వీళ్ళే.. మామూలు కంచులు కాదండోయ్..

Actress Who Cheated Heros: సినిమాల్లో అందాలను ఆరబోస్తూ హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించే హీరోయిన్స్ అప్పుడప్పుడు హీరోలను మోసం చేసే విలన్ రోల్స్ లో కూడా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈరోజు హీరోయిన్స్ ఇలా నెగటివ్ రోల్స్ లో ధైర్యం గా నటించడానికి స్ఫూర్తిని ఇచ్చిన హీరోయిన్ రమ్య కృష్ణ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘నరసింహా’ చిత్రం లో ఈమె పోషించిన నెగటివ్ రోల్ ఒక సెన్సేషన్. అప్పటి నుండి ఏ హీరోయిన్ నెగటివ్ రోల్ చెయ్యాలి అనుకున్నా, ఈ సినిమాలోని రమ్యకృష్ణ యాక్టింగ్ ని ఒక ఉదాహరణగా తీసుకునే వారు.

actress-who-cheated-heros

ఆ రేంజ్ లో ఆమె నటించింది. ఆ తర్వాత అదే తరహా పాత్రలు వివిధ కోణాల్లో దర్శకులు హీరోయిన్స్ ని చూపించారు. ఎక్కువగా హీరో ని మోసం చేసే హీరోయిన్ పాత్రల్లోనే దర్శకులు చూపించేవారు. ఒకసారి నిన్నటి తరం నుండి నేటి వరకు అలాంటి పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాము. నెగటివ్ రోల్స్ కి ఆజ్యం పోసిన రమ్యకృష్ణ శ్రీకాంత్ హీరో గా నటించిన ‘ఇంగ్లీష్ పెళ్ళాం. ఈస్ట్ గోదావరి మొగుడు’ అనే చిత్రం లో కూడా నటించింది(Actress Who Cheated Heros). ఇందులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ని మోసం చేసే పాత్రలో కనిపిస్తుంది రమ్య కృష్ణ.

ఇక ఆ తర్వాత సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా దశాబ్దం పాటు కొనసాగిన యంగ్ హీరోయిన్ త్రిష కూడా ధనుష్ హీరో గా నటించిన ‘ధర్మ యోగి’ చిత్రం లో నెగటివ్ రోల్ లో కనిపించింది. ఇందులో ఈమె ధనుష్ ని మోసం చేసి చంపేసే పాత్ర లో కనిపిస్తుంది. ఇక మన్మధ చిత్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో ప్రముఖ హీరోయిన్ ‘సింధు తులాని’ హీరో శింబు ని మోసం చేస్తూ తన స్నేహితుడితో ప్రేమాయణం నడిపే పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర ఆ రోజుల్లో బాగా క్లిక్ అయ్యింది. అలాగే గుండెల్లో గోదారి అనే చిత్రం లో తాప్సి కూడా ఇలాంటి పాత్రలోనే కనిపిస్తుంది.

ఇక రీసెంట్ గా RX 100 గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రం లో పాయల్ రాజ్ పుత్ హీరో తో రొమాన్స్ చేసి, అతనిని లైంగికంగా బాగా వాడుకొని,చివరికి తనకి అడ్డు వస్తున్నాడని చంపించేస్తుంది. ఈమధ్య కాలం లో ఒక హీరోయిన్ ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నెగటివ్ రోల్ చెయ్యలేదు, ఒక్క పాయల్ రాజ్ పుత్ తప్ప. పాయల్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో మరియు ఒక తమిళ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలు అన్ని ఈ ఏడాది చివరలో కానీ లేదా వచ్చే ఏడాది రిలేస్ చేదాం అనుకుంటున్నారు.

Exit mobile version