Home Cinema Payal Rajuput : ఆ దర్శకులు నన్ను వాడుకున్నారు.. పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్ ..

Payal Rajuput : ఆ దర్శకులు నన్ను వాడుకున్నారు.. పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్ ..

Payal Rajuput : ఈ మధ్య మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు కొదువలేదు. ఎందరో హీరోయిన్ లు బయట రాష్ట్రాల నుండి వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అవడం మనం చాలా సార్లు చూసాము. అయితే, ఇలానే పంజాబ్ నుండి ఓ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కార్తికేయ హీరోగా నటించిన సినిమా RX-100 లో అతని సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఇది ఆమె మొదటి సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అజయ్ భూపతి. (Payal Rajput comments on directors)

payal-rajput-sensational-comments-on-directors

ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ క్యరెక్టర్ చేసింది మరియు తన నటనతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ విజయం అందుకుంది. RX-100 విజయం తరువాత పాయల్ రాజ్‌పుత్ కు వరుసబెట్టి సినిమా ఆఫర్లు వచ్చాయి మరియు ప్రస్తుతం ఆమె బిజీ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో ఈ బ్యూటీ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ పాత్రలో నటించింది. ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరో ఇపుడు మనం తెలుసుకుందాం.

రవితేజ, వెంకటేష్, నాగచైతన్య లాంటి స్టార్స్ తో పాయల్ పనిచేసింది. ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు సరైన హిట్ RX-100 తరువాత లభించలేదు. ఇటీవల పాయల్ రాజ్‌పుత్ మెయిన్ రోల్ లో చేసిన సినిమా మాయ పేటిక. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యింది కానీ మన తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రీసెంట్ గా ఈ సినిమా విడుదలకు ముందు పాయల్ రాజ్‌పుత్ మరియు చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

అందులో ఇంటర్వ్యూయర్ అడిగిన ఓ ప్రశ్నకు తాను కెరీర్ లో ఎన్ని కష్టాలు పడ్డదో చెప్పుకొచ్చింది. తాను ఒక సినిమా ఒప్పుకుంటే, ఆ సినిమా కోసం తన 200 శాతం తాను చేస్తా అని చెప్పుకొచ్చింది. నేను ఎంత కష్ట పడ్డ కానీ నా కష్టానికి తగిన ఫలితం లంబించడం లేదని నటి చెప్పుకొని బాధపడింది. (Payal Rajput comments on directors)

అయితే, తన కెరీర్ మొదలులో కొందరు దర్శకులు తనని వాడుకొని వదిలేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పాయల్ రాజ్‌పుత్. మొదట నటికి స్టోరీ సెలక్షన్ రాకపోవడంతో కొందరు దర్శకులను ఆమె అడిగితె, వాలు అది ఆసరాగా తీసుకొని పిచ్చి పిచ్చి స్టోరీలు తనతో చేపించారని నటి వాపోయింది.

Exit mobile version