Friday, September 20, 2024
HomeCinemaAdah Sharma: సుశాంత్ సింగ్ చనిపోయిన ఫ్లాట్ ని కొనుగోలు చేసినా ఆదా శర్మ.. అందుకోసమేనా..

Adah Sharma: సుశాంత్ సింగ్ చనిపోయిన ఫ్లాట్ ని కొనుగోలు చేసినా ఆదా శర్మ.. అందుకోసమేనా..

Adah Sharma: ఈ ఏడాది బాగా ట్రెండింగ్ లో నిల్చిన హీరోయిన్ ఆదా శర్మ. కేరళలో మిస్ అవుతున్న మహిళల గురించి తీసిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఆమె కనబర్చిన నటన కి విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కానక వర్షం కురిసింది. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి ఆదా శర్మ ని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసింది(Adah Sharma Sushanth Singh). ఈ సినిమాకి ముందు ఆదా శర్మ వివిధ భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే, కానీ ఒక్క సినిమా కూడా ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి.

adah-sharma-sushanth-singh-rajput

తెలుగు లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా చేసింది. అలాంటి అమ్మాయికి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ తగలడం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా భారీ హిట్ అవ్వడం తో ఆదా శర్మ కి రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో ఇచ్చారు. అయితే ఆ రెమ్యూనరేషన్ లో కొంత భాగం ఆమె ఒక ఫ్లాట్ ని కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించింది. ముంబై లోని ఒక ఖరీదైన ఫ్లాట్ ని రీసెంట్ గానే ఈమె కొనుగోలు చేసిందని, ఆ ఫ్లాట్ లో గతంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఉండేవాడని తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ ఇదే. అలాంటి ఫ్లాట్ ని ఆదా శర్మ కొనుగోలు చేసింది.

actress-adah-sharma

ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చించుకున్న విషయం. ఒక వ్యక్తి చనిపోయిన ఇంట్లో ప్రవేశించడానికి భయపడే ఈరోజుల్లో, ఆదా శర్మ ఏకంగా కొనుగోలు చేసిందంటే ఆమె దరియానికి మెచ్చుకోవచ్చని అంటున్నారు నెటిజెన్స్(Adah Sharma Sushanth Singh). ఇది సుశాంత్ సింగ్ రాజ్ పుట్ సొంత ఫ్లాట్ కాదు, నెల నెల ఈ ఫ్లాట్ కి అద్దె చెల్లించేవాడు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ వార్తపై ఆదా శర్మ ఇప్పటి వరకు స్పందించలేదంటే, కచ్చితంగా ఈ ఫ్లాట్ ని ఆమె నిజంగానే కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై ఆమె భవిష్యత్తులో అయినా స్పందిస్తుందో లేదో చూడాలి.

adah-sharma

ఆదా శర్మ ప్రస్తుతం క్యూస్షన్ మార్క్ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు తెలుగు లో మంచి హిట్టులే కొట్టింది కానీ మధ్యలో ఒకేసారి ఇండస్ట్రీ నుండి మాయం ఐపోయింది ఆదా. దీనికి కారణం తెలీదు కానీ తిను మల్లి ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కంబ్యాక్ ఇవ్వబోతుంది.

సినిమా హిట్ ఐతే అమ్ముడికి ఉన్న అందానికి మల్లి కచ్చితంగా మరెన్నో సినిమా అవకాశాలు పట్టేస్తుంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts