Vijay Devarakonda Samantha Relationship : టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత మరియు విజయ్ దేవరకొండ పేర్లే వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి ‘ సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత సరికొత్త లవ్ స్టోరీ గా అందరికీ అనిపించింది. సమంత మరియు విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చింది. గతం లో వీళ్లిద్దరు జంటగా ‘మహానటి’ చిత్రం లో నటించారు. అందులో ఇద్దరివీ అతిథి పాత్రలే.
ఒక పూర్తి స్థాయి సినిమా చేసింది మాత్రం ‘ఖుషి’ తోనే. అయితే వీళ్లిద్దరి కలిసి సినిమా చేస్తున్న రోజు నుండి సోషల్ మీడియా రోజూ ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. రీసెంట్ గా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, కాశ్మీర్ లో షూటింగ్ జరిగినన్ని రోజులు వీళ్లిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే రూమ్ లో పడుకున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి(Vijay Devarakonda Samantha Relationship). ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరూ పసిగట్టలేకపోయారు కానీ, వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారని మాత్రం తెలుస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి డిన్నర్స్ కి వెళ్లడం, వరల్డ్ టూర్స్ కి వెళ్లడం వంటివి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె విజయ్ దేవరకొండ ఇంట్లోనే నివాసం ఉంటున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు సమంత తో బాగా దగ్గరై, రష్మిక కి దూరం అయ్యినట్టు మరో వార్త వినిపిస్తుంది. రష్మిక కూడా విజయ్ దేవరకొండ సమంత తో క్లోజ్ గా ఉండడం జీర్ణించుకోలేకపోతోంది అట.
రష్మిక కి సమంత అంటే చాలా అభిమానం, పలు ఇంటర్వ్యూస్ లో కూడా ఆమె తన అభిమానం ని చాటుకుంది. అలాంటి రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ – సమంత ప్రేమించుకుంటున్నారు అనే వార్త నిజమైతే తట్టుకోగలదా అని అంటున్నారు నెటిజెన్స్,చూడాలి మరి. ఖుషి సినిమా సమంత నిజజీవితం గురించిన స్టోరీ అని సోషల్ మీడియా లో చాలానే వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ లో ఫాన్స్ మాత్రం సినిమా పక్క హిట్ అని అప్పుడే సంబరాలు చేసుకోవటం మొదలు పెట్టేసారు.