Saturday, November 23, 2024
HomeCinemaNagarjuna: కోపం వచ్చినపుడు నాగార్జున ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా.. అఖిల్ వెల్లడించిన నిజాలు..

Nagarjuna: కోపం వచ్చినపుడు నాగార్జున ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా.. అఖిల్ వెల్లడించిన నిజాలు..

Nagarjuna Habits టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూల్ గా చిరునవ్వుతో డీల్ చేసే హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ప్రతీ హీరో ఎదో ఒక సమయం లో కోపం అదుపు తప్పినట్టు ప్రవర్తించడం మనం చాలా సార్లు చూసాము. మీడియా రిపోర్టర్స్ మీద అరవడం, అభిమానులను కొట్టడం ఇలాంటివి ఎన్నో మనం చూసాము, ఇంకా చూస్తూనే ఉన్నాము. కానీ ఎల్లప్పుడూ కూల్ యాటిట్యూడ్ తో ఉండే హీరోలలో ఒకడు అక్కినేని నాగార్జున. ఈయన ముఖం మీద చిరునవ్వు లేకుండా చూడడం అనేది చాలా తక్కువ. ఎప్పుడూ చక్కగా నవ్వుతూనే ఉంటాడు.

nagarjuna-habits

ప్రతీ ఒక్కరికి నవ్వుతూనే సమాధానం చెప్తూ ఉంటాడు. అయితే బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయం లో రెండు మూడు సార్లు నాగార్జున కంటెస్టెంట్స్ పై కోపం చూపించడం చూసి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా షాక్ కి గురి అయ్యారు. అయితే నాగార్జున కి కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం పై కొద్దిరోజుల క్రితమే అక్కినేని అఖిల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది(Nagarjuna Habits). ఆయన మాట్లాడుతూ ‘నాన్న గారికి కాపాపం వచ్చినప్పుడు అద్భుతమైన వంటకాలను వదండం అలవాటు.

akhil-akkineni-nagarjuna

ఆయన తన కోపాన్ని దివెర్త్ చేసుకోవడానికి చేసే కార్యక్రమం ఇది. ఎప్పుడైనా నేను షూటింగ్ నుండి ఇంటికి వచ్చినప్పుడు నాన్న ని కిచెన్ లో చూస్తే నాకు అర్థమైపోతుంది, ఈయనకి మూడ్ బాగాలేదు, మనం గెలక్కూడదు అని, ఆ సమయం లో అందరికీ ఆయన ఇష్టమైన వంటకాలను వండి స్వయంగా తా చేతులతో తినిపిస్తాడు’ అంటూ అక్కినేని అఖిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ ఇండియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోపం వస్తే ఇలా ప్రవర్తించేవాళ్ళు కూడా ఉంటారా..? తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటుంటారు, ఈ మాట ని నాగార్జున చాలా బలంగా మనసులోకి తీసుకున్నట్టు ఉన్నాడు.

naga-chaitanya

అందుకే కోపం వచ్చినప్పుడు ఎలాంటి అనర్దాలు తన నుండి జరగకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇది నాగార్జున దగ్గర నుండి అందరూ నేర్చుకోవాల్సిన లక్షణం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వయస్సులో కూడా అంత అందంగా ఉండడానికి కూడా కారణం తన కూల్ యాటిట్యూడ్ అని నాగార్జున అనేక సందర్భాలలో చెప్పాడు. నాగార్జున ప్రస్తుతం తన జనరేషన్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి తో పోటీ పడలేకపోతున్నాడు అనే చెప్పుకోవాలి. నాగార్జునకి హిట్టు పడక చాలా పెద్ద గ్యాప్ ఏ వచ్చింది అని చెప్పుకోవాలి. ఇకనైనా తన ఫ్రెండ్స్ లాగా మంచి స్టోరీ ఉన్న సినిమాలు ఎంచుకుంటే బాగుండు అంటున్నారు అక్కినేని అభిమానులు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts