Nagarjuna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున, కెరీర్ ప్రారంభం నుండి తన సొంత నిర్ణయాలతో టాప్ 4 హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే(Nagarjuna Marriage Sumalatha). అదంతా పక్కన పెడితే అక్కినేని నాగార్జున వైవాహిక జీవితం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడి కూతురు లక్ష్మి తో నాగార్జున కి వివాహం అయ్యింది.
కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత విబేధాలు రావడం తో ఆమె తో విడిపోయాడు నాగార్జున. ఆ తర్వాత తనతో కలిసి నటించిన అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదటి భార్య కి పుట్టిన కొడుకు అక్కినేని నాగ చైతన్య, అమల కి పుట్టిన కొడుకు అక్కినేని అఖిల్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు హీరోలు గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఇకపోతే నాగార్జున సినిమాల్లోకి రాకముందు, అమెరికా లో చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆరోజుల్లో సుమలత పెద్ద స్టార్ హీరోయిన్.
అప్పటి సూపర్ స్టార్స్ అందరితో కలిసి ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో వందల కొద్దీ సినిమాల్లో నటించింది. సుమలత ఎంతో సంసారం పక్షంగా వ్యవహరించే అమ్మాయి అని అక్కినేని నాగేశ్వర రావు గారికి అనిపించింది. ఈమెని నా చిన్న కొడుకు నాగార్జున కి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని ఆయనకు మనసులో కోరిక పుట్టింది(Nagarjuna Marriage Sumalatha). ఒకరోజు సుమలత తో నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ ‘చాలా లక్షణంగా ఉన్నావ్ అమ్మాయ్..పెళ్లి ఈడు వచ్చింది కదా, నాకు తెలిసిన ఒక అబ్బాయి అమెరికా లో ప్రస్తుతుతం చదువుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట’.
అప్పుడు సుమలత గారు ‘ఎవరండీ ఆ అబ్బాయి’ అని అడగగా దానికి నాగేశ్వర రావు సమాధానం చెప్తూ ‘నా చిన్న కొడుకు నాగార్జున..మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి, మంచి అందగాడు కూడా’ అని అన్నాడట. ఇక సుమలత కి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సిగ్గు తో తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, నాగార్జున అమల ని, సుమలత అంబరీష్ ని పెళ్లి చేసుకున్నారు.
నాగార్జున ప్రస్తుతం ఏ సినిమాలు లేకుండా చాలా కాలిగా ఉన్నాడు. తన తోటి స్నేహితులైన బాల కృష్ణ చిరంజీవిలు సినిమా మీద సినిమాలు చేస్తూ యమా బిజీ గా ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం ఇంకా బ్రేక్ ఇచ్చే సినిమా కోసం వేచి చూస్తున్నాడు. మరి ఆ బ్రేక్ ఇపుడు అప్పుడే వస్తుంది అంటారా..?