Home Cinema Allu Arjun: చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ ఇన్ని సినిమాల్లో నటించాడా..? ఇప్పటి వరకూ...

Allu Arjun: చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ ఇన్ని సినిమాల్లో నటించాడా..? ఇప్పటి వరకూ ఎవ్వరూ గుర్తించలేదే..

Allu Arjun: నేడు సినీ ఇండస్ట్రీ లో స్టార్స్ గా సూపర్ స్టార్స్ మరియు పాన్ ఇండియన్ స్టార్స్ గా కొనసాగుతున్న వారిలో బాల నటులుగా కూడా నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అలా బాలనటుడిగా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచుకున్నవాడే. చిన్నప్పుడు ఈయనకి చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ ఇమేజి ఉండేది(Allu Arjun Child Artist). ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ వంటి వారు కూడా బాల నటులుగా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత హీరోలు గా కూడా పెద్ద స్టార్స్ అయ్యారు. వీళ్లంతా బాలనటులుగా నటించారు అనే విషయం అందరికీ తెలుసు, కానీ స్టైలిష్ స్టార్ ఏళ్లుగా ర్జున్ కూడా బాలనటుడిగా రెండు సినిమాల్లో నటించాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

allu-arjun-child-artist-movies

పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో స్పెషల్ చిత్రం ‘విజేత’. వరుసగా యాక్షన్ మరియు మాస్ సినిమాలు చేస్తూ మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న చిరంజీవి కి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన చిత్రం ఇది. ఈ సినిమాలో చిరంజీవి కుటుంబం లో ఇద్దరు పిల్లలు ఉంటారు, వారిలో ఒకరు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun Child Artist). ఇది ఇలా ఉండగా కమల్ హాసన్ కెరీర్ లో ఆల్ టైం క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘స్వాతి ముత్యం’. స్వర్గీయ కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఇది.

ఇందులో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ప్రారంభ సన్నివేశాల్లో మరియు చివరి సన్నివేశాల్లో మనం అల్లు అర్జున్ ని గమనించొచ్చు. కమల్ హాసన్ లాంటి మహానటుడితో నటించాలని నేటి తరం స్టార్ హీరోలందరికీ కోరిక ఉంటుంది. రీసెంట్ గానే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నాడు కమల్ హాసన్. ప్రభాస్ కి కమల్ లాంటి మహానటుడితో కలిసి నట్టించడానికి ఇన్నేళ్ల సమయం పడితే , అల్లు అర్జున్ కి చిన్నతనం లోనే ఆయనతో నటించే అదృష్టం దొరికింది.

మళ్ళీ భవిష్యత్తులో కూడా వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో నటించే ఛాన్స్ ఉంది. తెలుగు సినిమా స్టార్ హీరో స్థాయి నుండి, పాన్ వరల్డ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ మార్కెట్ ఇప్పుడు కమల్ హాసన్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ. వీళ్లిద్దరు మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులతో పాటుగా, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తరువాత ఎం సినిమాలు చేయబోతున్నాడో క్లారిటీ రావలిసి ఉంది. ఫాన్స్ మాత్రం పుష్ప 2 కోసం చాల అంటే చాల ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version