Allu Arha School: టాలీవుడ్ లో ఒక పక్క వృత్తిపరంగా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తూ మరోపక్క వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్న హీరోలలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. నిన్న మొన్నటి వరకు కేవలం ఆయన టాలీవుడ్ స్టార్ మాత్రమే. కానీ ‘పుష్ప’ సినిమా తర్వాత పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం సృష్టించిన సునామి మామూలుది కాదు. సాధారణంగా ఏ హీరో అయినా పాన్ వరల్డ్ రేంజ్ కి రీచ్ అవ్వడానికి అవ్వడానికి రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో చేతులు కలుపుతారు.
కానీ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం వారి సపోర్ట్ లేకుండా, సుకుమార్ తో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉందో, సోషల్ మీడియా లో ఆయన గారాల పట్టి అల్లు అర్హ కి కూడా అంతే క్రేజ్ ఉంది. క్యూట్ గా అల్లు అర్హ మాట్లాడే మాటలకు ఫ్యాన్ కానీ వారంటూ ఎవరైనా ఉంటారా..? చిన్న తనం నుండి అల్లు అర్జున్ ఆమెకి సంబంధించిన వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేస్తూనే ఉంటాడు.
ఒక్కసారి అల్లు అర్హ క్యూట్ వీడియోస్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే, ఈ చిన్నారి చేసిన అల్లరి మొత్తం కళ్ళ ముందుకు వస్తాది(Allu Arha School). రీసెంట్ గానే ఈ చిన్నారి ‘శాకుంతలం’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా కూడా అందరికీ పరిచయమైనా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన, డైలాగ్ డెలివరీ చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురి అయ్యారు. తెలుగు ఇంత స్పష్టంగా ఇంత చిన్న వయస్సు లో ఇంత క్యూట్ గా మాట్లాడుతుందో అంటూ ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇదిలా ఉండగా అల్లు అర్హ తల్లి, అల్లు స్నేహా రెడ్డి నిన్నటి నుండి తన కూతురు స్కూల్ కి వెళ్లడం ప్రారంభించింది అంటూ ఒక ఫోటో పెట్టింది.
ఫస్ట్ డే ఆఫ్ ది స్కూల్ అంటూ అల్లు అర్హ బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్న ఫోటోని అప్లోడ్ చెయ్యగా అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్లు అర్హ అంటే అల్లు అర్జున్ కి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు తండ్రి కూతురులు కలిసి కార్ లో షికారుకు కూడా వెళ్తారు. అల్లు అర్జున్ తన కూతురితో ఉన్న వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఇపుడు అల్లు అర్హ స్కూల్ కి వెళ్లే వయసు వచ్చేసింది, చూస్తూ చేస్తూ ఎంత పెద్దది ఐపోయింది అని అల్లు అభిమానులు అనుకుంటున్నారు.