Home Cinema Allu Arha: చిన్నతనం లోనే నిమిషానికి 2 లక్షలు సంపాదిస్తున్న అల్లు అర్హ.. తండ్రిని మించిన...

Allu Arha: చిన్నతనం లోనే నిమిషానికి 2 లక్షలు సంపాదిస్తున్న అల్లు అర్హ.. తండ్రిని మించిన కూతురు..

Allu Arha: తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడో మన అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో ఆయన ప్రపంచ సినీ లోకాన్ని ఉర్రూతలు ఊగించాడు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ సెలబ్రిటీ కూడా పుష్ప మేనియా మునిగి తేలారు. ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ పుష్ప మ్యానరిజమ్స్ ని అనుకరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారు (Allu Arha Remuneration). ఈ స్థాయి క్రేజ్ ని ఇండియా లో ఎవ్వరూ దక్కించుకోలేదు, ఒక్క అల్లు అర్జున్ తప్ప.

allu-arha-remuneration

ఒక్కమాట లో చెప్పాలంటే రాజమౌళి తర్వాత మన టాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ గా మారిన సెలబ్రిటీ అల్లు అర్జున్ మాత్రమే. ప్రస్తుతం ఆయన ‘పుష్ప : ది రూల్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇది ఇలా ఉండగా ఆయన కూతురు అల్లు అర్హ కూడా చిన్న వయస్సు నుండే రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం మొదలు పెట్టింది (Allu Arha Remuneration). ఇక అసలు విషయం లోకి వెళ్తే ఆయన కూతురు ఇప్పటికే శాకుంతలం అనే చిత్రం ద్వారా బాలనటిగా వెండితెర కి పరిచయమైనా సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ కాకపోవడం వల్ల అల్లు అర్హ కి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, చిన్న వయస్సులోనే తెలుగు పదాలను చాలా చక్కగా ఉచ్చరిస్తూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్హ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర చిత్రం లో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో ఏళ్లుగా ర్హ కనిపించబోతుంది అట, త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ని జరపబోతున్నారు మేకర్స్.

ఇందులో అల్లు అర్హ కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట,ఈ పది నిమిషాలకు గాను ఆమెకి 20 లక్షణాలు రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంటే నిమిషానికి రెండు లక్షలు అన్నమాట. బాలనటుల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న చిట్టి తల్లిగా అల్లు అర్హ నిల్చింది. మరి ఇదే ఊపులో ఆమె బాలనటిగా వరుసగా సినిమాలు చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం స్టార్ కిడ్ గా ఎదుగుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్హ యూట్యూబ్ లో కూడా చాల ఫేమస్, ఈ బుడ్డిది యూట్యూబ్ లో చిలిపి పనులు చూస్తూ వీడియోస్ కూడా పెడుతుంది.

Exit mobile version