Home Cinema Vaishnavi Chaitanya: బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లెబెడుతారు..

Vaishnavi Chaitanya: బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లెబెడుతారు..

Vaishnavi Chaitanya: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం గా నిల్చిన చిన్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,మరియు విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.అందుకే ఓపెనింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. 7 కోట్ల 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం,కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని,బయ్యర్స్ కి మరియు నిర్మాతలకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది.

vaishnavi-chitanya-baby-movie-actress

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి మూడు రోజుల్లో 11 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి. రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియదు కానీ, ఈ సినిమా లో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైనా విషయాలు బయటపడ్డాయి. సినిమాల్లోకి రాకముందు ఆమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ షణ్ముఖ్ జస్వంత్ హీరో గా నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బాగా దగ్గరైంది.

ఆ తర్వాత ఆమెకి అడపాదడపా సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చాయి కానీ, ఇలా హీరోయిన్ గా చేసే అవకాశం మాత్రం ఈ చిత్రం తోనే దక్కింది. అంతకు ముందు ఆమె అలా వైకుంఠపురం లో, టాక్ జగదీష్, రంగ్ దే, వలిమై మరియు వరుడు కావలెను చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇదంతా మనకి ఆమె గురించి తెలిసిన విషయాలే, తెలియని విషయాలు ఏంటి అంటే, ఈమె ఒక గొప్ప క్లాసికల్ డ్యాన్సర్. కూచిపూడి లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని,అందులో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కే రేంజ్ పెర్ఫార్మన్స్ లు ఎన్నో ఇచ్చింది.

అంతే కాదు 2014 లో జరిగిన డ్యాన్స్ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ 1 గా నిల్చింది. అలా ప్రాచుర్యం పొందిన తర్వాతే మెల్లగా సినిమాల్లో కాంటాక్ట్స్ పెరిగి అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. ఇది ఇలా ఉండగా వైష్ణవి చైతన్య మొట్టమొదటి జీతం కేవలం 700 రూపాయిలు మాత్రమేనట. ఒక ఈవెంట్ లో ఆమె చేత రోజు మొత్తం డ్యాన్స్ వేయించుకొని చేతిలో 700 రూపాయిలు పెట్టి పంపారట. కానీ ఇపుడు బేబీ సినిమా చూసి అందరూ తన నటనకి ఫిదా ఐపోయారు అంటే నమ్మండి. మా ఫ్రెండ్స్ ఐతే థియేటర్ లో ఏడ్చేశారు కూడా, ఈ అమ్మాయి తప్పకుండ అదిరిపోయే స్టార్ అవుతుంది అని ట్విట్టర్ లో మోత మోగిపోతుంది.

Exit mobile version