అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆల్ ఇండియా స్టార్ గా ఓవర్ నైట్ ఎదిగిపోయాడు. పుష్ప సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో యమా బిజీ గా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో ఈ సారి సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇవ్వనుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ లో ఉంది. డబ్బింగ్ కి ఆర్టిస్ట్ అందరూ సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే, అల్లు అర్జున్ స్నేహ రెడ్డి గొడవ పడ్డారు అంటూ. ఇంతకీ ఏంటి మాటర్ తెలుసుకుందాం. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి టాలీవుడ్ లోనే పాపులర్ కపుల్. వీరిద్దరూ ఎప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ పిల్లల విషయం లో తెగ గొడవలు అవుతూ ఉంటాయి అంటూ తెలుస్తుంది. స్నేహ రెడ్డి పిల్లలిని చాల స్ట్రిక్ట్ గా పెంచాలి అనుకుంటుంది, ప్రతి రూపాయి విలువ తెలిసేలా పెంచాలి అని తన తాపత్రయం. కానీ అల్లు అర్జున్ తన పిల్లలిని చాల పోష్ గా, రిచ్ లైఫ్ కి అలవాటు చేయటం తో స్నేహ రెడ్డి కి అల్లు అర్జున్ కి ఎపుడు ఈ ఒక్క విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అని తెలుస్తుంది.