Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల పేరు మారుమోగుతోంది. ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో ఆమెను పెట్టుకుందాం అంటూ సజెస్ట్ చేస్తున్నారు మేకర్స్. ఈ అమ్మడు చేసుకున్న పుణ్యమేంటో కానీ చిన్న హీరో నుండి పెద్ద స్టార్ హీరోస్ వరకు అందరు ఈమె పేరే జపం చేస్తున్నారు. శ్రీలీల చేతులో ఇప్పటికే పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి పండగకు శ్రీలీల(Allu Arjun Sreeleela) నటించిన ఇదొక సినిమా వస్తూనే ఉంటుంది. ఇలా ఈ భామ వరుస షూటింగ్లతో బిజీ బిజీ అయిపొయింది.
శ్రీలీల మహేష్ బాబు రాబోయే సినిమా గుంటూరు కారం లో నటిస్తుంది. ఈ అమ్మడు నటించిన భగవత్ కేసరి సినిమా కూడా ఈ దసరా కు విడుదల అవ్వనున్నది. ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటిస్తుంది. ఇలా శ్రీలీల కనడ బ్యూటీ అయినా కూడా అక్కడ కంటే తెలుగు ఇండస్ట్రీనే ఆమెకు ఛాన్సులు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆమె చేతిలో పది సినిమాలు ఉన్న కూడా టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో ఆయన సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ గా కావాలని కోరారట. కానీ శ్రీలీల మాత్రం తన బిజీ స్కెడ్యూల్ వళ్ళ ఈ సినిమాను రిజెక్ట్ చేయాలిసి వచ్చిందట.
అయితే ఆ స్టార్ హీరో ఏకంగా నటి శ్రీలీల కు ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడట. అవును మీరు వినేది నిజమే, ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ శ్రీలీల కు వార్నింగ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ స్టార్ హీరో మరెవరూ కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అవును.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేసిన విషయం అందరికి తెలిసినదే. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ పోసిషన్ లో ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీలీల ను ఎన్నుకున్నారు చిత్ర యూనిట్.
కానీ ఆమె డేట్స్ సెట్ అవ్వకపోవడంతో ఆమె ఈ సినిమా స్టోరీ నచ్చిన కూడా రిజెక్ట్ చేయాలిసి వచ్చిందట. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఆమె కు కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చాడట. వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నపుడు డేట్స్ సెట్ చేసుకోవాలి కానీ ఇలా రిజెక్ట్ చెయ్యెకూడదు అంటూ అల్లు అర్జున్ అన్నారట. ఇక మంచి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు మరియు
అవి వచ్చినప్పుడే మనం ఓకే చేసేయాలి కానీ రిజెక్ట్ చేస్తే మల్లి ని వద్దకు రావని కొన్ని మంచి మాటలు చెప్పారట. దీనితో ఆమె(Allu Arjun Sreeleela) మనసు మార్చుకొని అల్లు అర్జున్ తో సినిమా కు ఓకే చెప్పేసిందట.