Allu Arjun : టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్ మరియు స్నేహలు ఒక్కరనడానికి సందేహం ఏమి లేదు. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మరియు అప్పటినుండి వీరు అన్యోన్యంగా ఉన్తున్నారు. వీరికి అల్లు అయాన్ అనే కుమారుడు మరియు అల్లు అర్హ అనే కుమార్తె జన్మించారు. ఈ కపుల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ మధ్య వీరి కుమార్తె అల్లు అర్హ శాకుంతలం సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసారు దర్శకుడు గుణశేఖర్. (Allu Arjun Allu Sneha)
ఈ సినిమాలో అర్హ చిన్నపాటి సమంతలా నటించింది. ఈ విషయాలు పక్కన పెడితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన భార్య స్నేహ అన్న మాటలు గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అల్లు అర్జున్ వక్కంతం వంశి కంబినేషన్లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. అయితే, అల్లు స్నేహను అర్జున్ ఇలా అడిగాడట..
సినిమాలో నేను ఆర్మీ ఆఫీసర్. ఒకవేళ నిజజీవితంలో కూడా నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటే నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావా! ఈ ప్రశ్నకు సమాధానంగా స్నేహ ఇళ్ల అన్నదట.. మీరు సంతోషంగా వెలవోచు, నేను పిల్లల బాధ్యత తీసుకుంటా అని రిప్లై ఇచ్చిందంట. ఆమె సమాదానికి అల్లు అర్జున్ షాక్ ఆయానని చెప్పారు. ఒకవేళ నేను చచ్చిపోతే ఎలా అని అల్లు స్నేహను అడగ్గా..మీరు దేశం కోసం పోరాడి ప్రాణం అర్పిస్తే నాకు అంతకన్నా ఆనందం ఏముంటదని అన్నారు అని ఇంట్వ్యూలో అల్లు అర్జున్ చెప్పాడు.
ఆ మాటలు విన్న బన్నీ ఒక్కసారిగా ఆమెను హత్తుకొని ఏడ్చేశాడట. ప్రస్తుతం అల్లు అర్జున పూష ది రూల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైస్ పాన్ ఇండియన్ లెవెల్ లో బారి విజయాన్ని సాధించింది.
ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ రచించి దర్శకత్వం వహించారు. రెండో భాగము ఒక్క గ్లిమ్ప్స్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి వెర్ ఇస్ పుష్ప అనే టాగ్ పెట్టి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. (Allu Arjun Allu Sneha)