Home Cinema Allu Arjun : తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మొదటి సారి చెప్పిన అల్లు అర్జున్..

Allu Arjun : తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మొదటి సారి చెప్పిన అల్లు అర్జున్..

allu-arjun-reveals-who-is-his-favourite-actress-of-all-time

తెలుగు రాష్ట్రాల్లో తను ఏంచేసినా అది ట్రెండ్ అవుతుంది, కుర్రాళ్ళు అందరూ అదే ఫాలో అవుతారు. హెయిర్ స్టైల్ నుండి, బట్టల స్టైల్ వరకు అతడు వేసిందే కొత్త ట్రెండ్. ఇప్పటికే అర్ధం ఐపోయి ఉండాలి ఎవరు ఆ స్టార్ అని. అల్లు అర్జున్ టాలీవుడ్ స్టైలిష్ ఐకాన్ స్టార్. పుష్ప సినిమాతో టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం దేశం అల్లు అర్జున్ అంటే ఎవరో తెలుసుకుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. నార్త్ లో ఈ సినిమా కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు.

లేటెస్ట్ గా అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చాడు. ఆ సమాధానం విని అందరూ షాక్, ఎవరు అని అనుకుంటున్నారా ? ఇంకెవరో కాదు మహానటి సావిత్రి. ఆవిడతో ఒక్క సినిమాలో అయినా నటించాలి అనేది అల్లు అర్జున్ కోరిక అట, కానీ అది సాధ్యంకాదు అని తెలిసి ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు అట. మహా నటి సావిత్రి ఎపుడు ఏ సినిమాలోనూ తప్పుడు పాత్రల్లో నటించదు, తాను చేసిన అన్ని పాత్రలో పక్కన వారిని ఉత్తేజ పరిచేలానే ఉంటాయి కానీ ఎక్కడ కూడా అసభ్యకరంగా ఉండవు. తెలుగు పద్ధతులు పాటిస్తూ చీరకట్టుకొని ఒక మహిళా ఎలా ఉండాలో అన్నడానికి సావిత్రినే నిదర్శనం.

Exit mobile version