ప్రస్తుతం థియేటర్ లలో ఆడుతున్న సినిమాల్లో బాగా సక్సెస్ అందుకున్న సినిమా రజాకార్. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా నిర్మాత ‘గూడూరు నారాయణ రెడ్డి’ సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు నుంచే ఆయనకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావటం మొదలైయ్యాయి అట. ఇక అన్నిటిని అధిగమించి ఈ సినిమా పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిలీజ్ చేసారు. ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఉన్న అన్ని సినిమాలలోనూ ఈ సినిమా థియేటర్లలో బాగా రాణిస్తుంది.
సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ప్రొడ్యూసర్ ‘గూడూరు నారాయణ రెడ్డికి’ దాదాపు 1100 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి అట. వెంటనే అప్రమత్తం అయిన కేంద్రం ఆయనకు 1+1 CRPF జవాన్‌లను భద్రత కోసం నియమించారు. అప్పట్లో నిజాం రాక్షశ పాలనపై ప్రజలు ఎలా పోరాడారో ఈ సినిమాలో చూపించటం జరిగింది. ఈ సినిమాకి సత్య నారాయణ దర్శకత్వం వహించగా, యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలో నటించింది.