Allu Arjun : ఇటీవల పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ధరించే వాచీల ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు చేతికి ధరించే వాచీల ధరలు లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటాయని, అందుకే తమ చేతికి ధరించే వాచీల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని పలువురు సామాన్యులు అంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి మరో వార్తను మనం ఇక్కడ చూద్దాం. అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ పెట్టుకున్న వాచ్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ వాచ్‌కి అక్షరాలా 4 లక్షల రూపాయిలు అంటూ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది వార్తా. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్స్ డే కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో బన్నీ చాలా సింపుల్‌గా టీ షర్ట్‌ని ధరించగా, దాదాపు 4 లక్షల విలువైన వాచ్‌ని ధరించాడు. ఈ గడియారం ఫనీరై కంపెనీకి చెందినది అంట. అయితే, ఈ వాచ్ ధరను సెలబ్రిటీ అవుట్‌ఫిట్ డి కోడ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించింది.
మరి టాలీవుడ్ లో స్టైలిష్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇలాంటి వాచులు ధరించడం కొత్తేమీ కాదు. లక్షల విలువైన వస్తువులను వాడుతారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలోని హీరోలకు చాలా కామన్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రీమియం వాచులు వాడే వారి లిస్టులో ఎన్టీఆర్ ఒక్కరు. ఈయన కోట్లు పెట్టి వాచులు కొంటారని ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పడం మనం చూసాము. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.