Home Cinema Divorce : విడాకుల వార్తల పై స్పందించిన ప్రభాస్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది..

Divorce : విడాకుల వార్తల పై స్పందించిన ప్రభాస్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది..

Divorce : సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో తారలు పెళ్లిళ్లు చేసుకోవడం మరియు కొద్దీ రోజులకే విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు మరో స్టార్ హీరోయిన్ విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇపుడు మనం ఇక్కడ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ నమిత తన భర్తతో విడాకులు తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

జెమినీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సుందరి ఆ తర్వాత తనదైన స్టైల్ తో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన బిల్లా, బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో నటించి మంచి ఫోల్వయింగ్ ను సంపాదించుకుంది ఈ భామ. ఈ సినిమా తరువాత నమితకు సినిమా ఆఫర్లు రాకపోయే సరికి, తన ప్రియుడు వీరేంద్ర చౌదరిను పెళ్లి చేసికొని కవలలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సినీ రంగానికి దూరంగా ఉన్నా రాజకీయాల వైపు పూర్తిగా యాక్టివ్ ఉన్నారు నమిత.

prabhas-heroine-namitha-responded-on-her-divorce-news-circulating-on-social-media

అయితే కొన్ని విభేదాల కారణంగా నమిత తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు ఇటీవల కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నమిత స్పందించింది. నేను నా భర్తకు విడాకులు ఇస్తానని ఎందుకు అనుకుంటున్నారు. నా భర్త మరియు నేను విడాకులు తీసుకోవడంలేదు. చాలా అంటే చాలా హ్యాపీ గా ఉన్నాము. సోషల్ నెట్‌వర్క్‌లలో వచ్చే ప్రతి వార్తా నిజం అయిపోదు. ఇలాంటి వార్తలు చేసే వాళ్లకు పని ఉండదని నా అభిప్రాయం అంటూ నమిత స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version