Allu Ayaan : సోషల్ మీడియా లో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న పేరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆయన నేడు మొట్టమొదటి నేషనల్ అవార్డుని కైవసం చేసుకున్న ఏకైక తెలుగు హీరో(Allu Ayaan Klin Kaara) గా చరిత్ర సృష్టించాడు. దాంతో ఎక్కడ చూసిన ఆయన గురించే ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. తెలుగు సినిమాకి గర్వ కారణంగా నిలిచాడు అంటూ పొగడ్తలతో లెజెండ్స్ సైతం అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇలాంటి సమయం లో ఆయన కొడుకు అల్లు అయాన్ గురించి సోషల్ మీడియా ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను చాలా నిరాశకి గురి చేస్తుంది. చిన్న పిల్లవాడిపై జరగుతున్న ఈ అసత్య ప్రచారం పై తీవ్రమైన నిరసన ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా లో పోలీసులను ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక అసలు విషయం లోకి వెళ్తే అల్లు అర్జున్ కొడుకు రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కి బావ అవుతాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
క్లిన్ కారా పుట్టగానే, ఆ పాపని అల్లు అయాన్ కి ఇచ్చి పెళ్లి చెయ్యమని అభిమానులు అప్పట్లో సరదాగా పోస్టులు కూడా పెట్టేవారు. అంత వరకు బాగానే ఉంది , కానీ నాలుగు టీఆర్ఫీ రేటింగ్స్ కోసం కొన్ని వెబ్ సైట్స్ ప్రచారం చేసే వార్తలు అభిమానులకు చిరాకు కలిగిస్తుంది. అల్లు అయాన్ జాతకాన్ని బట్టీ చూస్తే అతనికి భవిష్యత్తులో రెండు పెళ్లిళ్లు అవుతాయట. అంతే కాదు, క్లిన్ కారా(Allu Ayaan Klin Kaara) ని పెళ్లి చేసుకుంటే అల్లు అయాన్ ఎన్నో కష్టాలకు గురి అవుతాడని, వీళ్లిద్దరు కలవడం మంచిది కాదని మరియు
పెళ్లి చేసుకుంటే చాలా తొందరగా విడాకులు తీసుకుంటారని కొన్ని ఆకతాయి వెబ్ సైట్స్ ప్రచారాలు చేస్తున్నాయి. సెలబ్రిటీస్ అన్న తర్వాత వాళ్ళ పేరు ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం కొత్తేమి కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నదే ఇది. కానీ చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చెయ్యడం మానవత్వం లేదనే విషయాన్నీ గుర్తు చేస్తుంది.
అంటూ కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. వీరి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని పోలీసులను ట్యాగ్ చేసి హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్.