Friday, September 20, 2024
HomeCinemaAllu Sirish : చెప్పు తెగేలా కొడతా అంటూ అల్లు శిరీష్ ని అవమానించిన ఆ...

Allu Sirish : చెప్పు తెగేలా కొడతా అంటూ అల్లు శిరీష్ ని అవమానించిన ఆ వ్యక్తి ఎవరు..

Allu Sirish : అల్లు శిరీష్, అల్లు కుటుంబం నుండి వచ్చిన పెద్ద సక్సెస్ అవ్వని స్టార్ కిడ్. నాన్న ఏమో టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ అన్న ఏమో ఇండియా లోనే టాప్ హీరో. అల్లు శిరీష్ కూడా బాగా ట్రై చేసాడు హీరో గా కానీ సినిమా స్టోరీల వలనో ఏమో తెలీదు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇప్పటి వరకు శిరీష్ చేసిన అన్ని సినిమాలు ప్లాప్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా చేస్తూనే మరో సినిమాను నిర్మిస్తున్నాడు అల్లు శిరీష్.

అల్లు శిరీష్ కు సంబందించిన ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అల్లు శిరీష్ ని ఆ వ్యక్తి చూపు తెగేలా కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు అట. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు అల్లు అరవింద్. ఇంతకీ అరవింద్ గారు అల్లు శిరీష్ ని అలా ఎందుకు అన్నారు ? అల్లు శిరీష్ కి 21 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కారు కొనివ్వండి అంటూ అల్లు అరవింద్ తల తినేసాడు అట. నేను కొనివ్వను అని అల్లు అరవింద్ చెప్పేసారు అట.

allu-aravind-with-allu-sirish

ఐతే అల్లు శిరీష్ వినకుండా, అర్జున్ గాడికి 21 వోచిన వెంటనే కారు కొనిచ్చారు, చిరంజీవి అంకుల్ కూడా చరణ్ కి 21 వయసు వచ్చిన వెంటనే కారు కొనిచ్చారు. నాకు ఇప్పుడు 21 మీరు నాకు కారు కొనివ్వాల్సిందే అంటూ గొడవ చేసాడు అట శిరీష్. ఇక బీపీ లేసి అరవింద్ చెప్పుతో కొడతా ఇంకోసారి అడిగితే అంటూ సీరియస్ అయ్యారు అట. కావాలంటే ఒక లక్ష ఇస్తాను దానితో ఏమయినా చేసి ఇంకా డబ్బు సంపాదించి కొనుకో అని చెప్పారు అట. ఇక అల్లు శిరీష్ ఆ డబ్బు తీసుకొని 3 ఏళ్ళ తరువాత కారు కొనుక్కున్నాడు అట. ఈ విషయం స్వయానా అల్లు శిరీష్ ఏ కమెడియన్ అలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts