NTR-Amala: ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం ఇండస్ట్రీ లో కొత్తేమి కాదు, అలనాటి ఎన్టీఆర్ కాలం నుండి నేటి తరం స్టార్ హీరోల వరకు పతీ ఒక్కరికి అనుభవమైన సంఘటనలే. అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు, వాటిల్లో ‘మనం’ సినిమా కూడా ఒకటి. ముందుగా ఈ సినిమాని నాగేశ్వర రావు, నాగార్జున మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో చేద్దాం అనుకున్నారు(NTR Amala). నాగ చైతన్య పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించాలి. కానీ నాగార్జున సతీమణి అమల మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
మామయ్య గారితో కలిసి నటిస్తున్నారు, తారక్ బదులు మన కుటుంబం లో ఉన్న హీరోలని తీసుకుంటే చాలా బాగుంటుంది, అఖిల్ ని ఈ సినిమాతోనే లాంచ్ చేయిద్దాం, అదిరిపోతుంది అని చెప్పిందట. ఈ ఐడియా ఎదో బాగుందే, ఒక్కసారి డైరెక్టర్ తో మాట్లాడి చెప్తాను అని విక్రమ్ కుమార్ తో మాట్లాడాడు అట నాగార్జున. ఆయన మాట్లాడగా ఇప్పటికే ఎన్టీఆర్ డేట్స్ తీసేసుకున్నాం, ఇప్పుడు ఆయనకీ ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడ్డాడు అట డైరెక్టర్. అప్పుడు నాగార్జున తారక్ తో నేను మాట్లాడుతాను అని చెప్పి, ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా కాల్ చేసి
‘ఈ సినిమాని పూర్తి స్థాయి అక్కినేని కుటుంబం సినిమాగా మారిస్తే బాగుంటుంది అని అమల అంటుంది, నీ స్థానం లోకి అఖిల్ ని తీసుకుందాం అని చెప్పింది(NTR Amala). ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగలవా తారక్’ అని అడిగాడట నాగార్జున. ఆయన మీద గౌరవం తో ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు కానీ,విక్రమ్ కుమార్ మీద మాత్రం విపరీతమైన కోపం పెంచుకున్నాడు అట ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన వేరే సినిమా కూడా కాదు అనుకోని ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడమే. అయితే అఖిల్ ని తీసుకోవాలని అమల చెప్పినా ఎందుకో విక్రమ్ కుమార్ కి నచ్చలేదు. అఖిల్ కంటే ఈ సినిమా నాగ చైతన్య కి బాగా సెట్ అవుతుంది, అతన్ని తీసుకుందాం, కావాలంటే అఖిల్ ని చివర్లో అతిథి పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేద్దాం అని చెప్పాడట డైరెక్టర్.
చెప్పినట్టుగానే చేసాడు, ఇక తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము, అక్కినేని కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా మిగిలింది. అక్కినేని నాగేశ్వర రావు గారి చివరి సినిమా కూడా ఇదే. ఎన్టీఆర్ ప్రస్తుతం అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినెమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వనుంది.
ఇది ఎన్టీఆర్ సినీ చరిత్రలో 30వ సినిమా. ఈ సినిమా పై నందమూరి అభిమానులకి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.