Home Cinema Balakrishna : బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..

Balakrishna : బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..

Balakrishna : నటసింహం గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య తన కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించాడు. ఈయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను బద్దలు కొడుతోంది. అప్పట్లో ఈయన నటించిన నరసింహ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై చూసి ఆనందించడానికి బాలకృష్ణ నటనే కారణమని మర్చిపోకూడదు. ప్రస్తుతం ఇప్పుడు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారనే వార్త కూడా వైరల్‌గా మారింది. అయితే బాలయ్య తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సీక్వెల్‌ రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంని జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజున చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే, అఖండ 2లో బాలీవుడ్ స్టార్ హీరోను విలన్‌ గా బోయపాటి శ్రీను ఎన్నుకుంటాడనే వార్తలు ఇప్పుడు చాలా హల్చల్ చేస్తున్నాయి.

bollywood-star-hero-acting-as-villain-in-balakrishna-akhanda-cinema

అఖండ 2లో బాలీవుడ్‌ స్టార్ అయినా సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. బాలయ్య – సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలు ఒకటే స్క్రీన్ మీద కనిపిస్తే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అకాండ మొదటి భాగం విజయం సాధించింది. ఇప్పుడు అఖండ 2ని అంతకు మించిన స్థాయిలో ప్లాన్ చేసాడు బోయపాటి. ఇపుడు ఈ వర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version