Home Cinema NTR : విశ్వక్ సేన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. అంత కాస్టలీ గిఫ్ట్...

NTR : విశ్వక్ సేన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. అంత కాస్టలీ గిఫ్ట్ ఎందుకు ఇచుంటాడు..

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన వార్తలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొన్న ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు సంబందించిన ఒక వీడియో లీక్ అయ్యి ఇంటర్నెట్ లో ఒక సునామి నే సృష్టించింది అని చెప్పొచ్చు. ఆ వీడియో లో ఎన్టీఆర్ సముద్రం నుండి నడుచుకుంటూ బయటకి వస్తున్నాడు. గోవా లో షూటింగ్ జరుగుతుండగా ఎవరో తీసిన వీడియో అది.

ntr-vishwak-sen

దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవ్వనుంది. నిన్న ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ టీంని కలిసి అభినందనలు తెలియ చేసాడు. సిద్దు జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ నాగ వంశి తో పాటు విశ్వక్ సేన్ కూడా అక్కడికి వెళ్ళాడు. రాత్రి మొత్తం ఎంజాయ్ చేసాం అని, దేవర మ్యూజిక్ విన్నామని, ఆల్బం అదిరిపోయింది అంటూ అనిరుద్ ని పొగుడుతూ సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేసాడు విశ్వక్. ఇక విశ్వక్ చేతికి ఉన్న వాచ్ చూసి అభిమానులు అది ఎన్టీఆర్ వాచ్ కదా అంటూ ఆశ్చర్యపోయారు. ఒక అభిమాని ఎన్టీఆర్ కి ఇష్టమైన వాచ్, బానే కొట్టేశావ్. చాల అదృష్టవంతుడివి అంటూ కామెంట్ చేసాడు. ఇంతకీ ఎన్టీఆర్ అంత కాస్టలీ వాచ్ విశ్వక్ సేన్ కి ఎందుకు ఇచ్చి ఉంటాడు?

Exit mobile version