Home Cinema SKN Bouncers Attack: బేబీ సినిమా ప్రొడ్యూసర్ బౌన్సర్లు దాడి.. అసలు ఎం జరిగింది..

SKN Bouncers Attack: బేబీ సినిమా ప్రొడ్యూసర్ బౌన్సర్లు దాడి.. అసలు ఎం జరిగింది..

SKN Bouncers Attack: రీసెంట్ సమయం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాలే ఎక్కువ అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలు ఈ ఏడాది ఆడినవి చాలా తక్కువ. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే ఎక్కువ శాతం దుమ్ము లేపాయి. అలాంటి చిన్న సినిమాలలో ఒకటి బేబీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే 90 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుంది అని అంటున్నారు.

skn-baby-movie-producer-bouncers-attack-media

ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్ టూర్ నిమిత్తం మూవీ యూనిట్ పలు థియేటర్స్ ని సందర్శించి ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఆ సక్సెస్ టూర్ లో భాగంగా బేబీ చిత్ర నిర్మాత SKN, హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య తో పాటుగా డైరెక్టర్ సాయి రాజేష్ భీమవరం లో ఆడుతున్న బేబీ మూవీ థియేటర్ ని సందర్శించారు. వీళ్ళను చూసేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్య లో హాజరయ్యారు. దీనితో క్రౌడ్ అదుపు తప్పడం తో పోలీసులు కూడా కంట్రోల్ చెయ్యలేకపోయారు. అక్కడికి లోకల్ మీడియా రిపోర్టర్స్ కూడా భారీ సంఖ్య లో న్యూస్ ని కవర్ చెయ్యడానికి వచ్చారు.

తోపులాటలో మీడియా రిపోర్టర్స్ ని నిర్మాత Skn బౌన్సర్స్ తోసేసారు(SKN Bouncers Attack). దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. విషయం నిర్మాతకి తెలియడం తో వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితులను చక్కదిద్దాడు. ఈ గొడవ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. వీడియో గురించి పలు రకాలుగా అందరూ అనుకుంటున్న సమయం లో నిర్మాత స్వయంగా కల్పించుకొని వివరణ ఇచ్చాడు. ఇకపోతే బేబీ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు,50 రోజుల కేంద్రాల విషయం లో కూడా సరికొత్త రికార్డు నెలకొల్పుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇదే కనుక జరిగితే ఈ ఏడాది ‘వాళ్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత అత్యధిక సెంటర్స్ లో బేబీ చిత్రం 50 రోజులు పూర్తి చూసుకోబోతుంది అని అంటున్నారు. బేబీ సినిమా మాత్రం SKN కి బానే డబ్బు తెచ్చిపెట్టింది. కొంత మంది నెటిజనులు మాత్రం బేబీ మూవీ హిట్ కొట్టడంతో ప్రొడ్యూసర్ కి కళ్ళు నెత్తికెక్కయి అని కూడా అంటున్నారు.

Exit mobile version