Home Cinema Venu Swamy : బిగ్ బాస్ లో వేణు స్వామి.. రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతాది..

Venu Swamy : బిగ్ బాస్ లో వేణు స్వామి.. రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతాది..

Venu Swamy : నక్క తోక తొక్కితే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇన్నాళ్లుగా వెనుస్వామి సోషల్ మీడియాలో ఎన్ని ట్రోలింగ్‌లు ఎదుర్కొన్నాడో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, ప్రభాస్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శించిన వెనుస్వామి, పొలిటికల్ వైపే వేలు పెట్టి ఇంతకంటే ఎక్కువ ట్రోల్ అయ్యారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని వెనుస్వామి అన్నారు. కానీ ఇక్కడ సీన్ రెవెర్స్ అయ్యింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.

ఏపీకి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని అన్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచి సీఎంగా అధికారం చేపట్టారు. దింతో తాను భవిష్యత్తును అంచనా వేయనని వేణుస్వామి స్వయంగా ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం. అయితే అప్పటి నుంచి వేణుస్వామి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. కానీ కొందరు అతన్ని లేనిపోనీ విషయాల్లో ఇరికించి ఆడుకుంటున్నారు. వేణుస్వామి ఎప్పుడూ ఇలాంటి ట్రోలింగ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూనే ఉంటాడు.

astrologer-venu-swamy-participating-in-bigg-boss-new-season-he-got-huge-remuneration-for-this

వివాదాస్పద షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించనున్నాడని తెలిసింది. వేణు స్వామి లాంటి వారు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే షోనీ ఈసారి నాగార్జున హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తారంట. వేణు స్వామి తన కొడుకు మాజీ కోడలు విడాకులు తీసుకోబోతోందని చెప్పాడు. అలాంటి వ్యక్తిని ఎలా డీల్ చేస్తాడో చూదాం. అందుతున్న సమాచారం ప్రకారం, బిగ్ బాస్ నిర్వాహకులు అతనికి ఒక కోటి రూపాయల పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది.

Exit mobile version