Home Cinema Jani : రామ్ చరణ్ – ఉపాసన గురించి జానీ మాస్టర్ సూపర్ పోస్ట్.. నిజంగా...

Jani : రామ్ చరణ్ – ఉపాసన గురించి జానీ మాస్టర్ సూపర్ పోస్ట్.. నిజంగా దేవుడు..

choreographer-jani-master-awesome-post-praising-ram-charan-and-upasana

Jani : టాలీవుడ్ అత్యుత్తమ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ గురించి మన అందరికి తెలిసిన విషయమే. ఈయన సైడ్ డాన్సర్ గా పరిచమై ఒక్కో మెట్టు ఎక్కుకుంటా ఈ స్థాయికి వచ్చారు. అయితే జాన్నీ మాస్టర్ ఇటీవల భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవలే తన పుట్టినరోజును సందర్బంగా తాను అధ్యక్షుడిగా ఉన్న కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లకు విశేష సేవలందిస్తున్నట్లు ప్రకటించారు. రామ్‌చరణ్ మరియు అతని భార్య ఉపాసన కొణిదెల తన కొరియోగ్రాఫర్‌ల సంస్థ సభ్యులకు భీమా అందిస్తామని తెలిపారు.

జానీ మాస్టర్ సోషల్ నెట్‌వర్క్‌లలో ఈ అంశంపై పోస్ట్ చేశాడు. సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడే. నా పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్‌ అన్నయ్య నన్ను ఇంటికి పిలిచాడు. వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలిసి చాలా సంతోషించాను. చరణ్, ఉపాసన వదిన, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు నాకు దక్కాయి.

ఇంకా ఆయన పొడిగిస్తూ, నేను ఇంతకుముందు అడిగిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని, మా డ్యాన్సర్ల యూనియన్ లో ఉన్న 500 కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ సభ్యులకు తన మద్దతు ఉంటుందని పూర్తిగా ప్రకటించారు. తాను కోరిన సాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకు విలువనిచ్చాడు అని ఆయన తెలిపారు. పైగా, అన్ని కుటుంబాలను ఆడుకోటం సాధారణ విషయం కాదు. అందుకు మేం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం అని జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Exit mobile version