Home Cinema Balakrishna: బాలయ్య ధరించిన ఈ సింహం బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Balakrishna: బాలయ్య ధరించిన ఈ సింహం బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Balakrishna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ అనే పదం తీస్తే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు బాలయ్య. ఫైట్స్ ,డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లోనూ శబాష్ అనిపించుకుని, ఎన్టీఆర్ కొడుకు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు(Balakrishna Lion Bag Price). ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన బాలయ్య బాబు, మాస్ లోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ టైం లో బాలయ్య మూవీస్ ని యూత్ ఆడియన్స్ కూడా చూడడం మొదలు పెట్టారు.

bala-krishna

‘అఖండ’ చిత్రం నుండి బాలయ్య బాబు సుడి తిరిగిపోయింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన ఆహా మీడియా లో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఆయన్ని యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. ఆయన యూత్ ఆడియన్స్ కి దగ్గర అయ్యినప్పటి నుండి సోషల్ మీడియా లో బాలయ్య బాబు ఏమి చేసినా తెగ ట్రెండ్ అయిపోతుంది. రీసెంట్ గానే అసెంబ్లీ లో తొడలు కొట్టి, మీసాలు మెలివేసిన బాలకృష్ణ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాడో మనమంతా చూసాము. ఇప్పుడు లేటెస్ట్ గా టీడీపీ నాయకులతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్ నుండి విజయవాడ కి చేరుకున్నాడు.

అక్కడ గన్నవరం విమానాశ్రయం లోకి చేరుకున్న తర్వాత ఆయనకీ సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో విడుదల అయ్యాయి. భుజానికి బ్యాగ్ తగిలించుకొని, మోస్ట్ ట్రెండీ లుక్ లో కనిపించిన బాలయ్య ని చూసి యూత్ మెంటలెక్కిపోతున్నారు. ఆయన ధరించిన బ్యాగ్ వెనుక 3D సింహం బొమ్మ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. అభిమాన హీరో ధరించే వాటిని కొనుగోలు చెయ్యడానికి ముందు ఉండే ఫ్యాన్స్, ఈ బ్యాగ్ ని ఆన్లైన్ లో కొనేందుకు గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు(Balakrishna Lion Bag Price). కానీ ఆ బ్యాగ్ రేట్ చూసి నోరెళ్లబెట్టారు. దాదాపుగా పాతిక వేల రూపాయిలు విలువ చేసే ఈ బ్యాగ్, డిస్కౌంట్ ఆఫర్ వల్ల కేవలం 15,689 కి కొనుగోలు చెయ్యొచ్చు అన్నమాట.

మిడిల్ క్లాస్ అభిమానులు ఎలాగో ఇలాంటి ఖరీదైనవి కొనలేరు, కానీ రిచ్ అభిమానులు మాత్రం ముందు వెనుక చూడకుండా కొనేయొచ్చు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా భగవత్ కేసరి. ఈ సినిమా షూటింగ్ డబ్బింగ్ రెండు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం గా ఉంది. ఈ సినిమా రానున్న సంక్రాంతికి రిలీజ్ చేదాం అని అనుకుంటున్నారు సినిమా బృందం.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై నందమూరి ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గాని ఏమయినా తేడా జరిగితే డైరెక్టర్ అనిల్ రావిపూడి పని మటాష్ ఐపోయినట్టే.

Exit mobile version